రెవెన్యూ విభాగపు అత్యవసరమైన రైతు సమాచారం


1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 Syd
3) ఒక ఎకరాకు = 43,560 Sft
4) ఒక గుంటకు = 121 Syd
5) ఒక గుంటకు = 1089 Sft
6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09చదరపు ఫీట్లు
7) 121 x 09 = 1089 Sft
8) 4840 Syd x 09 = 43,560 Sft
9) ఒక సెంట్ కు = 48.4 Syd
10) ఒక సెంట్ కు = 435.6 Sft

Common Terminology in Revenue Department

గ్రామ_కంఠం :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్‌భూమి :

భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు :

ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు_భూమి (బంచరామి) :

గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం :

పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్‌_ఇనాం :

దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్‌ (పహాణీ) :

గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

*తరి : సాగు భూమి
*ఖుష్కీ : మెట్ట ప్రాంతం
*గెట్టు : పొలం హద్దు
*కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు
*కమతం : భూమి విస్తీర్ణం
*ఇలాకా : ప్రాంతం
*ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి
*బాలోతా ఇనాం : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి
*సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి
*సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి
*సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది
*నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం
*కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి
*ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.
*ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ : దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.
*బందోబస్తు : వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.
*బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.
*పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.
*ఫైసల్‌ పట్టీ : బదిలీ రిజిస్టర్‌
*చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.
*డైగ్లాట్‌ : తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.
*విరాసత్‌/ఫౌతి : భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.
*కాస్తు : సాగు చేయడం
*మింజుములే : మొత్తం భూమి.
*మార్ట్‌గేజ్‌ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.
*మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).
*పట్టాదారు పాస్‌ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.
*టైటిల్‌ డీడ్‌ : భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.
*ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.
*ఆర్‌ఎస్సార్‌ : రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.
*పర్మినెంట్‌ రిజిస్టర్‌ : సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.
*సేత్వార్‌ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.
*సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.
*దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.
*ఎకరం : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.
*అబి : వానకాలం పంట
*ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు
*అసైన్‌మెంట్‌ : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి
*శిఖం : చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం
*బేవార్స్‌ : హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.
*దో ఫసల్‌ : రెండు పంటలు పండే భూమి
*ఫసలీ : జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.
*నాలా : వ్యవసాయేతర భూమి
*ఇస్తిఫా భూమి : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి
*ఇనాం దస్తర్‌దాన్‌ : పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి
*ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.
*గైరాన్‌ : సామాజిక పోరంబోకు
*యేక్‌రార్‌నామా : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

Source: Facebook share

మరణం…

మరణం…

జీవితంలో ఎన్నో సంధర్బాలకి, సంఘర్షణలకి, సంఘటనలకి ముందస్తుగా సిద్దపడి, తగిన జాగ్రత్తలు తీసుకునే మనం.. ఈ ఒక్క మరణం అనే విషయంలో మాత్రం ఎందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోము? ఎందుకంత నిర్లక్ష్యం?

ఒక మధ్యతరగతి ఉధ్యోగి కలలు కంటాడు.. తను రిటైర్ అయ్యే సమయానికి కొడుకులిద్దరు మంచి ఉధ్యోగాల్లో స్థిరపడాలని, పెళ్లిల్లు చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని.. చివరి రోజుల్లో ఎలాంటి బాధరబంధి లేకుండా కన్ను మూయాలని..

అతని భార్య కలలు కంటుంది.. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు స్థిరపడి ఇల్లు కలకలలాడాలని..

కోడుకులు ఆశ పడతారు.. ఒక మంచి ఉధ్యోగం సంపాదించి, స్థిరపడి, ఒక మంచి అమ్మాయిని పెళ్లిచేసుకొని, భార్యా పిల్లలతో అమ్మానాన్నలతో సంతోషంగా బతకాలని..

అందరూ దాదాపుగా ఇవే, లేదా ఇలాంటి ఆశలతో తమ జీవితాలకి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని అందిపుచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతూ.. ఆ పోరాటంలో, అత్యంత కీలకమైన… మరియు వీటన్నింటికి అత్యావశ్యకమైన ఆరోగ్యాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో అర్ధం కాదు ఒక్కొక్కసారి..

షుగర్ లెవల్ 500 పైకి ఎగబాకినా, బి.పి 200/120 మించిపోయినా, ఛాతిలో మంటగా ఉన్నా, ఎన్నో రాత్రుల్లు నిద్రపట్టకపోయినా, ప్రతిరోజు మందుకి భానిసైనా ఎందుకంత ఉదాసీనత? ఆ లక్షణాలన్ని ప్రాణాంతకమని తెలిసినా ఎందుకంత నిర్లక్ష్యం?

ఇప్పుడు ఆ చిన్ని కుటుంబంలో… ఆ తండ్రి అకాల మరణం చేసినా, ఆ తల్లి అర్ధాంతరంగా గతించినా, ఆ పిల్లలు ఏదో ఒక రోడ్డు దుర్ఘటనలో చిన్నవయసులో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి కలిగే మానసిక క్షోభ వర్ణనాతీతం.. కేవలం అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది…

Friends, అలాంటి పరిస్థితుల్లో మీరుగాని, మీకు తెలిసిన వాళ్లుగాని ఉంటే, దయచేసి సరైన సమయంలో సరైన వైద్యపరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండండి..

చివరగా ఒక్క మాట… మీ చేతుల్లో… కేవలం మీ జీవితం మాత్రమే కాదు, మీ వాళ్ల సంతోషం కూడా ఉందని మరచిపోకండి.

ఏ మూల దాక్కుందో కేకేసి పిలువు

ఎవరి కోసం… ఎందుకోసం.. దేనికోసం… ఈ తాపత్రయం… నీ అంతులేని ఆత్రం…?

అంతరంగ తరంగంలోని అనురాగాన్ని అదిమిపట్టి, ప్రాపంచిక ప్రయోజనాలకి పాకులాడుతావు… ఎందుకోసం?
అనుచుకోలేని ఆవేశంతో అర్థహీనుడివౌతావు… దేనికోసం??

నీ ఇంటి వాకిట్లో నీలాలు రాలాలని నిశిరాత్రిలో నిలుచున్నావే….
పక్కింట్లో మనస్పర్ధలు ‘మనకెందుకులే’ నిట్టూర్పులో నీరుగారిపోతున్నా పట్టించుకోవా..!?
అడిగాను కదా అని పక్కింటి పంచాయతీకి పంచె ఎగగట్టి బయలుదేరావా…
నీ ఇంటి దేవతలు వృద్దాశ్రమంలో అనాథలుగా పడి ఉన్నారు, ఆ పంచె దించి పలకరించిరా ఒకసారి…!!

బందిపోటు రూపుదాల్చి, బల్లక్రింద చేయిపెట్టి, బడుగుజీవి బ్రతుకుకొట్టి… బ్యాంకుల్లో కూడబెడుతున్నావు..
నీ కాలికింది ఖరీదైన కార్పెట్ కోసమా? నీ భార్య ఒంటిపై వేసుకోలేనన్ని నగల కోసమా?? నీ పిల్లల పెళ్లిల్లకోసమా???

కారణాలు చెప్పే పనిలేదు… కనికరం ఏ మూల దాక్కుందో కేకేసి పిలువు.. !!!

కలవై వస్తావని..

నీ మాట వినని ఏ రేయినైనా..
నిదురేమిటో నా దరికి రాదు…
నిదుర వస్తే కూడా నిశ్చింతే నాకు..
కలవై వస్తావని.. కథలు చెప్తావని…

2012 in review of my blog

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 2,800 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 5 years to get that many views.

Click here to see the complete report.