విండోస్ లైవ్ రైటర్ నుండి నా మొదటి టపా

చూడడానికి ఈ వసతి చాలా సౌలభ్యంగా ఉంది కానీ రాసిన టపా ఎలా కనబడుతుందోనన్న కంగారు ఉండడంచేత ఈ పరీక్ష టఫా రాస్తున్నాను…

ఒక చిత్రాన్ని కూడా అతికించే ప్రయత్నం ఇక్కడ జరగుతోంది…పనిలో పని సరదాగా తెలుగు అంకెలు నేర్చుకుందాం….

Telugu Numbers

ప్రకటనలు

ఘుమఘుమలాడే మటన్ మసాలా తయారుచేయడం ఇలా…

Packed Mutton(Goat Meat)

కెనడాలో దొరికే ప్యాకేజ్డ్ మటన్

Sliced Red Onion

చిన్నగా తరిగిన ఉల్లిపాయలు

Sliced Green Chillies

రెండుగా చీల్చిన పచ్చిమిర్చి

Red tomotoes

కొన్ని టమాటాలు (2 Kg Muttonకి నాలుగు)

Mutton Marination

మటన్‌ని ఊరబెట్టడానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారంపొడి

Marinated Mutton

Mix of Mutton (Goat Meat) + Ginger & Garlic Paste + Turmeric + Chilly powder

బాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసా !!

Items for Mutton

ఆన్నీ సిద్ధం

Green chilies getting roasted in edible oil

నూనెలో వేగుతున్న పచ్చిమిరపకాయలు

Red Onion getting roasted in edible oil

ఉల్లిపాయలు కూడా..

Roasting onion & green chilies

ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగారు రంగుకి వేగాక కొద్దిగ అల్లంవెల్లుల్లి పేస్ట్ మరియు చిటికెడు పసుపు వేసి కలపండి.

Add marrinated Mutton to onion mix

ఊరిన మటన్ ని కుడా వేసేయండి

Mix well

కలపడంలోనే ఉంది అసలు కిటుకు 🙂

Maintain a moderate temperate

మంట మండాలి.. కానీ కూరని తగలబెట్టేంతగా కాదు సుమా !!.

ఇది చాలా కీలకమైన దశ… నూనెలో ఒక 15 నిమిషాలు వేగితేగానీ మటన్ ఉడకదు….

Add tomatoes

మటన్ ఉడికింది కాబట్టి.. ఇక టమాటాలు వేసే సమయం వచ్చినట్టే….

Indian traditional grinder for spices

చేతితో చేసిన గరం మసాలా ఘాటు..కొన్న పొడిలో రాదు అని నా ఉద్యేశ్యం :)… కొన్ని లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి….

Grinded Indian spices in traditional grider

బాగా దంచేయండి..

Mix well and add Chilly powder

మరోసారి బాగా కలిపి కావాల్సినంత కారంపొడి చల్లుకోండి.. మీ ఓపిక..

10 నిమిషాలు ఉడకాల్సిందే!!

Add Spices and corriander powder

ఇప్పుడు మన గరం మసాలా మరియు దనియాల పొడి వెసేసుకోవచ్చు… ఉప్పుకూడా..

Finally add Salt and wait for some time before getting it down.

తాజా సువాసనలకి కొత్తిమీర మరియు పుదినా ఆకులు వేసుకోవచ్చు..

మరో 5 నిమిషాలు ఎదురు చూద్దురూ..

Enjoy the flavor

ఘుమఘుమలాడే మటన్ కూర తయారు !!

కూర మీకు కుదిరినా, కుదరకపోయినా చెప్పడం మరవకండేం.. ఉంటాను… -ప్రవీణ్ (కెనడా) !!

A Page from my digital dairy.. what a magical change…

Tuesday, October 2, 2012 at 5:48am Toronto http://maps.google.com?q=43.670922,-79.381513+(Toronto) Happy birthday my lord Gandhi…. What a magical change am witnessing from past few days..!! I do not remember seeing a 5.30 morning so fresh and so vibrant. You may not believe, my mobile alarm still has some minutes to ring :-)… May be today it feeling jealous at my willpower for being setup 6AM everyday and for being forbidden with my new and enriched conciousness…. Yet some corner of my heart reminding me the great guy who, in all means had a great impact on my thoughts, implementations and actions. He is the guy who may have a overwhelming fan following at his best in all social networking sites.. but however am tributing my new acheivements and far new actions to the same guru personally at heart, to whom I always proud for being born in my generation.. Mr.Robin Sharma… my beloved motta boss :-)…. Shared with Memoires for Android http://market.android.com/details?id=net.nakvic.dromoris http://sites.google.com/site/drodiary/

నవరస నవలాకేళి…. ఈ వెన్నెల్లో ఆడపిల్ల

తెలుగు నవల చెరుపులు విరుపులు… సరస సరాగాలు… ప్రేమ, ఆర్థి, ఆర్థత పదాల అర్థం తెలుసుకోవాలంటే ఈ ఒక్క నవల చదివితే చాలదూ???

వెన్నెల్లో ఆడపిల్ల On Kinige

ర్యాగింగ్…

ఒక కుర్రవాడు హైద్రాబాద్ లో చదువు ముగించుకొని ఉద్యోగరిత్యా ఒక పల్లెటూరికి పయనమౌతాడు. అక్కడ ఒక భూస్వామి దగ్గర 5 వేల రూపాయలకి (ఉధ్యోగిలా కాదు, జీతగాడిగా…) పనికి కుదురుతాడు ఓరోజు…

భూస్వామి: ఏం పిలగా నిన్ననే వస్తా అని రాలే, ఏమైంది?
జీతగాడు: మొదటిసారి మా ఊరు వదిలిపెట్టి వచ్చాను కదా సార్, ఏడుపొచ్చింది. Facebook లో status update చేస్తే తెలిసినవాళ్లందరూ ఓదార్చారు..
——–అందుకే నిన్న పనికి రావాలనిపించలేదు, ఏమనుకోకండి..

భూ: ఏందో నీ గోళ, అందుకే ఈ చదువుకున్న పిలగాడిన జీతంల పెట్టుకునుడు వద్దంటే వింటుందా మా ఆవిడ..

(గొడ్లచావిడి లోనుండి) అంబా…… తౌడ్….. అంబాఆఆ…..

భూ: అదిగో ఆ బర్రెలు ఎందుకో అరుస్తున్నయ్… మీ అమ్మగారు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. నువ్ వెళ్లి వాటికేంకావాలో వేసి, మనకేంకావాలో తీసుకొనిరా…

(గొడ్లచావిడి లోనుండి) అంబాఆఆఆఆఆఆ…… తౌడ్‍డ్‍డ్‍డ్‍డ్‍……..

భూ: ఇంకా ఏంచూస్తునవ్ పో,. జల్ది..

జీ: (కోపం, చిరాకు, భాధ, భయం కలగలిపి) .. అలాగే సార్…

~~~~~ గొడ్ల చావిడిలో ~~~~~

జీతగాడు: ఏవండీ… ఇక్కడ బర్రె అంటే ఎవరండీ..!?
పశువు: తెలియకడుగుతున్నవా… తెలుసుకోవాలనడుగుతున్నవా?….. నేనే !! ఏంది సంగతి ?
Buffallo

జీ: (అమాయకంగా..) ఇందాకటినుండి అరుస్తున్నారు.. ఏం కావాలండీ!?
ప: (కడుపులో దాచుకున్న గడ్డిని సుతారంగా నెమరువేస్తూ..) ఎవ్వడ్ భే నువ్వ్ ?? ఇంతకుముందు ఇటుమొకాన నిన్ను చూసినట్టులేదు.. కొత్తగచ్చినవా??
జీ: అవునండీ.. నా పేరు రామక్రిష్ణ.. నిన్ననే పనిలో కుదిరా..!
ప: నా దగ్గరకొచ్చి నాగురించి నన్నే అడిగితే, గదే అనుకున్న కొత్తపోరనివని… ఏం పీకుదామని పనిలో కుదిరనవ్?
జీ: (అమాయకంగా..) సార్ ఏం పీకమంటే అది పీకుదామని అనుకుంటున్నానండి..
ప: (మనసులో..) ఇదేదో బకరా ఉన్నట్టుంది… ఒక చూపు చూడాల్సిందే!!!
(బయటకి) గట్లనే పీకుదువుతియ్ గనీ.. ముందు పొయ్ గడ్డి తీసుకరా… నిన్నటినుండి ఈ ఎండు గడ్డి నమిలీ నమిలీ దవడలు దంగుతున్నయ్..
జీ: అలాగేనండీ…
(వెళ్లి.. నాలుగు పచ్చని గడ్డి పరకలు తెచ్చి వేస్తాడు…)

ప: (కోపంగా..) ఏంరా, ఎట్ల కనిపిస్తున్న నేన్ నీకు… నా దుడ్డె ఒక పన్నుకిందికి రావు ఆ గడ్డి పరకలు…
(కళ్లు పెద్దవి చేసి… కుమ్మబోతున్నట్టు విదిలిస్తూ..) పొయ్ మోపు తీసుకరాపోరా..!!!
జీ: (దడుసుకొని)… సారీ అండి, తెలియక..
(ఏడుస్తూవెళ్ళి… పెద్దమోపు తెచ్చి వేశాడు…)

ప: ఏంరా, చిన్నపోరనిలెక్క ఏడుస్తున్నవ్? తిక్కరేగితే నేను గట్లనే ఒర్లుతగనీ… లైట్ తీస్కోని కండ్లు తుడ్సుకో..
జీ: (కండ్లు తుడుచుకుంటూ) అలాగేనండి…
ప: (Full Concentrationతో గడ్డిని తింటూ..) ఇంతకీ ఏం చదివినవ్‍రా?
జీ: B.Tech, specilization in I.T అండీ
ప: (తలపైకెత్తి) అంటే మా సార్ కొడుకు సదివేదేకదా!? ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు మేనేజిమెంట్ ల ఫీజ్ కట్టి జాయిన్ అయిండు.. నా దుడ్డె కూడా ఈడుకొచ్చింది కానీ, వాని సదువుఅయితే అయితలేదు.. ఏం సదువో ఎమో ఎ..ద..వ… (మళ్ళీ కొంచెం గడ్డి కరుచుకొని)
అయినా వాడు ఇంట్లో ఉండగా నిన్నెందుకు పనిలో పెట్టుకున్నారో ఎరుకనేనా??
జీ: తెలియదండి…!?!
ప: వాడు నా వీపుతోమడానికి కూడా పనికిరాడని.. (క్రిందపడి పడీ పడీ దొర్లుతూ… హ్హహ్హహ్హహ హ హ…)
జీ: (ముసిముసిగా నవ్వుతున్నాడు..)

ప: (మెల్లిగాలేచి నిలబడి) చానారోజులైందిరా ఇలా నవ్వుకొని… అవుగనీ పట్నంల గన్ని గన్ని కంపెనీలుండగా గీడికొచ్చినవేందీ??
జీ: Freshersకి OPenings లేవు.. Backdoorలో డబ్బులు అడుగుతున్నారు…
ప: కట్టకపోయినవా??
జీ: (రోషంగా) అయ్యకులేక అయిదు అంటే, కొడుకచ్చి కోటి అడిగిండంట… ఆ పైసలే ఉంటే, గిట్ల నీ వీపుతోమే ఖర్మ ఏంటినాకు!??
ప: ఏమ్‍రా నఖరాలా? ఎక్కువ తక్కువ కథల్ పడితివంటే కోసి కారం పెడుత బిడ్డ ఏమనుకుంటున్నవో…. నాదసలే హైద్రాబాద్..!!
జీ: (బిక్కమొఖం వేసి) నేను చదువుకుంది కూడా హైద్రాబాద్‍లోనేనండి..
ప: అవున్లే ఈ మధ్య ఇంటర్ అయిపోంగనే కుక్కలు కూడా CAT కార్డ్ తీస్కొని హైద్రాబాద్ ఎర్రబస్సెక్కుతున్నయంట కదా!!? (మళ్లీ క్రిందపడి దొర్లుతూ…)
జీ: (ఏడుపుమొఖం పెట్టాడు.. 😦 )

ప: (మళ్లీ కొంచెం గడ్డి కరుచుకొని) సరేగానీ, ఇంతకీ జీతమెంతిస్తా అన్నడురా మన సార్ గాడు?
జీ: (నిశ్శబ్ధంగా నేలకేసి చూస్తూ ఉన్నాడు… ఏడుపుమొఖంతో)
ప: ఏ… ఊకోరా భయ్.. ఏదో మజాక్ చేస్తే సీరియస్ తీసుకుంటున్నవ్…
జీ: (మెల్లిగా కళ్లు తుడుచుకుంటున్నాడు..)
ప: ఓ..హో..హో… గిట్లైతే మస్తు కష్టంరా.. ఎంతైనా మీ సదువుకున్నోళ్లు లవు సుకుమారంరా…
జీ: అదేం కాదండి… పెద్దవాళ్లు తిడితేనే ఏడుపొస్తుంది.
ప: ఓయ్.. ఎవడ్ భే పెద్ద? ఏదో బర్రెలెక్క పుట్టిన కాబట్టి ఇట్ల బలిసిన కనీ (తన దేహాన్ని తనివితీరా చూస్తూ)…
నా వయసెంతర… (కాలు నేలకేసి రాస్తూ.. సిగ్గుపడుతూ) మొన్ననే నాలుగు పోయి అయిదు పడ్డయ్…

జీ: అవునా….!!!! నమ్మలేకపోతున్నానండి… అయినా మరి మీరెందుకు హైద్రాబాద్ నుండి ఇక్కడకి వచ్చారు?
ప: ఈ ఇంటికి ముందెవడచ్చిండ్రా?
జీ: మీరే…!
ప: అంటే సీనియర్ ఎవడ్రా?
జీ: మీ…రే……!!
ప: మరి Questions ఎందుకడుగుతున్నవురా!?
జీ: (ఖంగుతిని) సారీ అండి..
ప: ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటే, నా బిడ్డకు కూడా నువ్వే వీపుతోముతవ్ Future లో.. లేదనుకో నీ వీపు నేను తోముత… Present లో.
జీ: అలాగేనండీ…
ప: నీ అండిల నా పెండ పెడుతగనీ… నీ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ గురించి రెండుముక్కలు చెప్పు.. (షరామామూలుగా గడ్డి కరుచుకొని)
జీ: (ఉత్సాహంగా.. 😀 ) మా ఊరు కందలపాడండి.. పక్కనే ఉన్న టౌన్లో అరవింద్ అనే సినిమా హాలు ఉందండీ… ఆ హాలులో..
ప: బఠానీలు అమ్మేటొనివా!?
జీ: ఛీ, కాదండి.. ప్రతివారాంతం సినిమా చూసేవాన్నండి. నా స్నేహితులు రాజు, సురేశ్, బాబు, మహేందర్, వేణుగోపాల్, రాజేశ్, మహేశ్.. ఇంకా… ఇంకా… కొంతమంది ఉన్నారండి.
అందులో సురేశ్, బాబు దుబాయ్ వెళ్లారండి, వారంవారం ఫోన్ చేస్తారండీ.. మరేమో… మహేందర్, మహేశ్, ఇంక రాజులు ఇంకా చదువుకుంటున్నారండి… ఇంక మరేమో…
ప: ఏయ్… ఆపుభే నీ లొల్లి… (గట్టిగా దబాయించి)
జీ: (బిక్కమొఖం పెట్టాడు.. 😦 )
ప: రెండుముక్కలు చెప్పుర అంటే, చాట భారతం చెపుతవేందిర.. మనసున పడతలేదా ఏంది?
నీతోని ఇట్ల నడువదిగని… ముందు అచ్చిన పని కానీయ్… సాయంత్రం పెండ ఎత్తడాన్కి వస్తవ్ కదా అప్పుడు పెడదంతియ్ మన సోది..
(అని తనకు నచ్చిన గడ్డిని తినడానికి ఉధ్యుక్తమైంది)..

జీ: (భాధగా కదిలుతూ..) అలాగేనండి.
(చెంబు చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చోని, పాలు పితుకుదామని పశువు కింద పట్టుకుంటాడు… అలా పట్టుకోగానే సడెన్ గా షాక్ తగిలినట్టై పశువు వెనకకి తల తిప్పి చూసింది)
ప: అనుకున్నరా… ఇట్లాంటిదేదో చేస్తవని..
జీ: నేనేం చేశానండి (అయోమయంగా ఫేసు పెట్టి)???
ప: ఏం చేయడానికి పంపిండు సార్ నిన్ను??
జీ: పాలు పితకడానికి….!!
ప: మరి నువ్వేం పట్టుకున్నవ్!?
జీ: (షాక్ తగిలి, పట్టు తప్పి, వెనక్కి వాలి..) అంటే నువ్వు…
ప: YES. బర్రెని కాదు దున్నపోతుని..
జీ: మరి బర్రె ఎవరూ అని అడిగితే మీరే అని అన్నారు?

ప: ఉత్తినే మజాక్ చేసిన (కన్ను కొట్టింది… 😉 )

~~~~~ సమాప్తం ~~~~~

తరువాయి భాగం చదవాలనిపిస్తే… ఇక్కడ నొక్కండి

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో…

హాయ్ అంటే హలో అన్నవ్…
ఫోన్‍లో హలో అంటే, చాయ్‍కి చలో అన్నవ్…
జోకులేస్తే నవ్వినవ్ – కోపమొస్తే తన్నినవ్…
సోపతంటే సరేనన్నవ్ – ఎన్నేండ్లైనా తోడుంటనన్నవ్…
నా కండ్ల దుమ్ము వడితే – నీ కండ్ల నీళ్ళు తిరిగేటియి…

నీ కండ్లల్ల సూసుకుంటనే ’ఐ లవ్ యూ’ అంటి,
ఆలోచించుకుంటా అని చెప్పి జారుకుంటివి..
పదిదినాలకి పండ్లికిలిచ్చుకుంట ’సై’ అంటివి.
దునియాల నా అసోంటి పోటుగాడే లేడని –
మురిసేలా జేస్తివి..

తీరాకరికి పెండ్లి చేసుకుందాం అంటే,
మా అవ్వయ్య అద్దంటుర్రు – ’నన్ను యాదిమర్సిపో’ అంటివి…

నన్ను మరిసిపోయి – నీ గురించే సోంచాయించవడితి…
ఏట్ల మరిసిపోవాల్నే.. ఆ గుర్తుల్ని..!?

నా మదిలో రంది లేపితివి..
నా గుండెల్లో గునపం గుచ్చితివి..
నా మనసంటే గంత అలుసా..?
పాతకం తలుగుతది తెలుసా..!?

మళ్ల పుడితె గిట్ల, నీ కడుపునే పుడ్తా..
నీకు కడుపుకోత పెట్టి, బలవంతంగా చస్తా..
అపుడుగానీ నీకు తెలువది..
నా గుండెల్లో భాదేందో…
నీకొరకు అది పడే తపనేందో…!!!

ఉంటా,
నీ గుండెకి బైపాస్
ప్రవీణ్‍గాడు

ఆగస్టు 10 కి నాలుగు అందమైన కారణాలు

వచ్చింది… మా అమ్మ కల నెరవేరుస్తూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంట అడుగిడింది ఒక ఏంజల్…
తన లేలేత చేతులతో బుడి బుడి నడకలతో మా గుండెల్నిండా ఆనందాలు నింపడానికి దివి నుండి భువికి మా వదినమ్మ కడుపునుండి వచ్చేసింది.
మా రాముడికి ’లవకుశ’ పుట్టలేదని కాదు,లక్ష్మిలా మా లోగిలిలో నవ్వులు విరజిమ్మే పాప వచ్చిన సంతోషం కొన్నివేల రేట్లు ఎక్కువగా ఉంది.
మా అమ్మ ఎపుడూ అంటుంది… అమ్మాయికోసం చూడగా చూడగా నాల్గవవాడిగా నువ్వూ మగపిల్లాడివే అయ్యావు… నువ్వు అమ్మాయిలా పుడితే ఎంత బాగుండేదిరా అని..
సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత తన పెద్దకొడుకే తనకి పాపని కానుకగా ఇవ్వడం ఇంకా నా మదిలో స్వచ్చంగా ఒక మరుపురాని అనుభూతిగా మిగిలి ఉంది.
నిస్సారంగా సాగుతున్న మా జీవితాల్లో వెలుగులు నింపడానికి వేంచేసిన మా పెద్ధన్నయ్య పాపకి ఈ చిన్ని బాబాయి తరఫున సాదర స్వాగతం…
పుట్టిన సమయం: సాయంత్రం 4.37 ని||లు
ఈరోజు ఇంకా విశేషాలు ఎంటంటే….
మా చిన్నన్నయ్య పుట్టినరోజు ఈరోజే..
మా మంచి బాబాయి అంజయ్య గారి పుట్టినరోజూ ఈరోజే..
మా మేనమామ కూతురు పుట్టింది కుడా ఈరోజే…
అంటే ఆగస్టు 10 ని గుర్తుంచుకోవడానికి నేడు నాలుగు అందమైన కారణాలు…

వచ్చింది… మా అమ్మ కల నెరవేరుస్తూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంట అడుగిడింది ఒక ఏంజల్…

తన లేలేత చేతులతో బుడి బుడి నడకలతో మా గుండెల్నిండా ఆనందాలు నింపడానికి దివి నుండి భువికి మా వదినమ్మ కడుపునుండి వచ్చేసింది.

మా రాముడికి ’లవకుశ’ పుట్టలేదని కాదు,లక్ష్మిలా మా లోగిలిలో నవ్వులు విరజిమ్మే పాప వచ్చిన సంతోషం కొన్నివేల రేట్లు ఎక్కువగా ఉంది.

మా అమ్మ ఎపుడూ అంటుంది… అమ్మాయికోసం చూడగా చూడగా నాల్గవవాడిగా నువ్వూ మగపిల్లాడివే అయ్యావు… నువ్వు అమ్మాయిలా పుడితే ఎంత బాగుండేదిరా అని..

సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత తన పెద్దకొడుకే తనకి పాపని కానుకగా ఇవ్వడం ఇంకా నా మదిలో స్వచ్చంగా ఒక మరుపురాని అనుభూతిగా మిగిలి ఉంది.

నిస్సారంగా సాగుతున్న మా జీవితాల్లో వెలుగులు నింపడానికి వేంచేసిన మా పెద్ధన్నయ్య పాపకి ఈ చిన్ని బాబాయి తరఫున సాదర స్వాగతం…

పుట్టిన సమయం: సాయంత్రం 4.37 ని||లు

ఈరోజు ఇంకా విశేషాలు ఎంటంటే….

మా చిన్నన్నయ్య పుట్టినరోజు ఈరోజే..

మా మంచి బాబాయి అంజయ్య గారి పుట్టినరోజూ ఈరోజే..

మా మేనమామ కూతురు పుట్టింది కుడా ఈరోజే…

అంటే ఆగస్టు 10 ని గుర్తుంచుకోవడానికి నేడు నాలుగు అందమైన కారణాలు…