దున్నపోతీయం–రెండవభాగం

(మొదటి భాగం చదవాలనిపిస్తే… ఇక్కడికి వెళ్ళిరండి)

కాలం పరుగులు తీస్తోంది…

గాయాలు కాయాన్ని రాటుదేల్చుతున్నాయి…

ప్రాయమూ పాఠాలు నేర్చుకుంటోంది…….

ఒక చల్లని వేకువ జామున…

ఊషోదయపు వెచ్చని కిరణాలు ఇంకా భూమిని ప్రసన్నం చేయని గడియల్లో… ఎవరు set చేయకుండానే కోడి అలారం మోగించింది… కట్టేసే అవకాశమూ ఇవ్వకుండా ఇంటివెనక ఎండిపోయిన పత్తిమొక్కల్లో పరుగులు తీసింది…

వేకువపు బద్దకపు నిట్టూర్పుల జాడ ఎరుగక… చాలా ఉత్సాహంగా, జాలీ జాలీగా పనిలోకి దూకాడు చింటూ… పచ్చని గడ్డిపరకలు చేతుల్లోకి ఎత్తుకొని ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసుకున్న చావడిలోకి అడుగులు వేసాడు… దున్నపోతుకి పరకలు దగ్గరగా వేసి, పైకి లేచి, చెవుల్లోనుంచి iPod 4th Gen కి అనుసందానించబడిన Bose తలపట్టీ (Headset) తీసి…. పశువుని చూస్తూ…

 

చింటూ (Party smile): ఏం మామా dull అయిపోయినవ్? bore కొడుతుందా ఏంది?

దున్నపోతు (Devil): (గడ్డివైపు తలదించైనా చూడకుండా… చింటూ వైపే తధేకంగా చూస్తూ… ) నా mood సంగతేముందిగని, నువ్వేంది యమా జోరు మీదున్నవ్?.. మధ్యలో కొత్తగా ఈ ‘మామ్‘ ఏంది?

 

Party smile: ఇదంతా ఇప్పటి ట్రెండ్ మామా… పనిలో ఉన్నా, పాయకానాలో ఉన్నా… పాటలు పాటలు పాటలూ… NoteNoteNoteNote వినండి వినండి… ఉల్లాసంగా… ఉత్సాహంగా…NoteNoteNoteNote

Devil: అబ్బో…

Party smile: అవ్‌ మల్ల..

Devil: గదిసరే గానీ… గీ ‘ మా…. ‘

Party smile: గాడికే వస్తున్న.. చిల్ డ్యూడ్… ఎంతకాలమని… అన్న… దున్నా… అని పిలుస్తాను చెప్పు… It’s getting bore yaa… అవతలివాడు అన్నైనా, బావైన, మామైనా.. ఆ మాటకొస్తే బాబాయైనా సరే… NO matter what.. Just “ మామా “ అంతే !!

Devil: కానీ దున్నని కదరా… ఇననీకీ.. అదోలా ఉంది !??

Party smile: Ok. గట్లైతే let’s try “ మచ్చి ”…?

Devil: గదేంది… మచ్చి అంటే హిందీల దోమ కదా !? దున్నలాంటి నన్ను పట్టుకొని దోమ అంటే.. సూట్ అవ్వదేమో (ప్రశ్నార్థకపు కవళికతో)

Party smile: హ్హ … హ్హ… హ్హహ… హహ్హహ… (కడుపు పట్టుకొని నవ్వుతూ…) silly dude… హిందీలో దోమ మాత్రమే కాదు… తమిళం లో “ బావ / మమ” అని కూడా…

Devil: అబ్బో… ఇగ అన్ని అయిపోయినయ్… ఇప్పుడు తమిళం మీద పడ్డవా ??

Party smile: గదే కదా మచ్చి ఫ్యాషన్‌ అంటే… ఎవ్వడికీ అర్థం కాకపోయినా… వినడానికి కొత్తగా ఉంటే చాలు…

Devil: ఎదో ఒకటి పిలిచి సావ్ గానీ…నేను జరిన్ని గడ్డిపోసలు తింట.. నువ్వు పొయిరా !!

Party smile: ఏయ్….య్… మచ్చి… Winking smile … మరిందాక మూడ్ లేదన్నవ్ 

Devil: నీతో బాతాకానీ షురూ చేసినంక ఇంక మూడు నాలుగు అన్నీ set అయినయ్ గనీ… పొ… పొ… పొయ్ రా…

Party smile: ఏ.. ఏంది మచ్చి ఊకే… పొ పొ అనుకుంట Sad smile… ఏదో పశువుని తోలినట్టు తోలుతున్నవ్..

Devil: ఆహా… అలాగా… మరి నువ్వు నన్నేమని పిలుస్తునవ్ భే… ఓయ్ .. ఏయ్… అంటలేవూ.?? వచ్చిన కొత్తల ఎట్లుండేటోనివి !?..

ఏవండీ…. ఎవరండి….. మీరేనా అండి… (వెక్కిరింతగా చింటూ ని అనుకరిస్తూ) అనుకుంటూ నా దుడ్డె లెక్క పసిపోరనోలే అమాయకంగా ఉండేటోనివి… ఇప్పుడు చూడు… నాలుగు మీసాలొచ్చి… నాలుగు రాళ్లు ఎనకేసుకున్నవో లేదో… అస్సలు భూమి మీద కాళ్లే నిలుస్తలేవు……

Party smile: అంటే…. మరీ… అదీ…(సిగ్గుపడుతూ.. మెలికలు తిరుగుతూ.. కుడికాలి బొటనవేలు నేలకు రాస్తూ.)

Devil: ఆ…. గదే… కాలం మారింది… ఈడు జోరుకొచ్చింది… మాట, మర్యాద మారిపోయింది…

Party smile: ఏ… ఊకో… గసోంటిదేం లేదు మచ్చి… (గారాభంగా.. ఊరడిస్తూ… వేణుమాదవ్-లా నడుం ఊపుతూ)

Devil: ఛల్… చుప్..ప్…..ప్….  Steaming mad . అస్సలే తిక్కమీదున్న… ఒక్క కుమ్ము కుమ్మానంటే పొయ్ ఏడనో పడతవ్ భిడ్డ… పైలం…

Party smile: నిజంగా… Annoyed .. !!?

Devil: ఏం ఢౌటా.. Green with envy ??

Party smile: ఏయ్… నిజంగా  (ఇంకొంచెం కోపం పెంచి) !??

Devil: ఏమ్‌రో… చెప్తే సమజయితలేదా… మజాక్ లెక్క అనిపిస్తుందా ఏంది…

Party smile: ఏ…. ఇంకోసారి చెప్పు… నిజంగా కుమ్ముతవా… (రెట్టించిన స్వరంతో)…

Devil: అంటే… అది… ఏం… కుమ్మలేననుకున్నవా… Freezing (దిక్కులు చూస్తూ..)

Party smile: ఆ… హా….. (దున్నవైపు అడుగులు వేస్తూ..).. అలాగా… ఏదీ కుమ్ము.. (కిందికి వంగుతూ, కవ్విపుంగా)..

Devil: (వెనక్కి అడుగులేస్తూ).. ఏం.. ఏందిరా భయ్ .. నీ లొల్లి.. పెద్ధ తలయాకనొప్పి వచ్చిపడింది నీతోని..

Party smile: ఎహె యాడికి పోతవ్ … (అంటూ కొమ్ములు రెండు చేతుల్తో గట్టిగా అదిమిపట్టి)..

Devil: ఓయ్.. ఏం చేస్తవ్రో.. (కళ్ళు మూసుకుంటు… అనుమానంగా..)

Party smile: (…. నుదుటిపై ముద్దు పెట్టాడు….)

Devil: ఏయ్… ఆ.. . ఉ…. చీ.. (సిగ్గుపడుతూ..).. ఏయ్….

Party smile: (వెనక్కి లేచి… కొమ్ములు వదిలేస్తూ…)

Devil: ఏయ్.. ఏందిభే ఇది.. ఎవడన్న చూస్తే ఏమనుకుంటారు…అసలే కాలం మంచిగ లేదు (మెల్లిగా గుసగుసగా) దోస్తానాగిట్ల నడుస్తుందనుకుంటే !?

Party smile: ఏమన్న అనుకోని, నాకేంది… నా మచ్చి, నా ఇష్టం.. ముద్దుపెట్టుకుంట, ఏమన్న చేసుకుంట..

Devil: అవ్… సాల్లే సంభడం.. పొయ్ పని చూస్కో.. మల్ల సాయంత్రం బయటకి తీస్కపోవాలి..

Party smile: గట్లనే.. (నవ్వుతూ.. జాల్లీగా.. వెనక్కి తిరిగి).. మా మంచి మామ..  Winking smile (iPod తిరిగి చెవుల్లోకి దూర్చి.. చల్ మోహనరంగ styleలో Dance చేస్తూ వెళ్లిపోయాడు)

Devil: (మనసులో…) పిచ్చి పోరడు.. ఎందుకో నేనంటే గంత అభిమానం…(సిగ్గుపడుతూ… తలదించి గడ్డి కరచుకొని ఆరగించసాగింది…

(Clock తరువాయి భాగం (అనేది ఒకటుంటే) వచ్చేవారం Clock)

 

 

 

 

ప్రతిపదార్థ తాత్పర్యాలు (తెలంగాణా యాసలోని పదాలకి అర్థం)..

అవ్‌ మల్ల – అవును మరి ఇననీకీ – వినడానికి
ఇగ – ఇక సావ్ – చావు
జరిన్ని – జర + ఇన్ని = కొన్ని గడ్డిపోస – గడ్డిపరక
దుడ్డె – దూడ పసిపోరనోలే – పసి పిల్లవాడిలాగ
అంటలేవూ – అనడంలేదా ఉండేటోనివి – ఉండేవాడివి..
గదే – అదే ఊకో – ఊరుకో
గసోంటిదేం – అలాంటిదేం ఏడనో – ఎక్కడో
పైలం – జాగ్రత్త సమజయితలేదా – అర్థం అవడంలేదా
మజాక్ – సరద యాడికి – ఎక్కడికి
దోస్తానాగిట్ల – దోస్తానా గానీ
(జాన్‌ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌ ల అనుబంధం)
సాల్లే సంభడం – చాలులే సంభరం
గంత – అంత

ప్రకటనలు