విండోస్ లైవ్ రైటర్ నుండి నా మొదటి టపా

చూడడానికి ఈ వసతి చాలా సౌలభ్యంగా ఉంది కానీ రాసిన టపా ఎలా కనబడుతుందోనన్న కంగారు ఉండడంచేత ఈ పరీక్ష టఫా రాస్తున్నాను…

ఒక చిత్రాన్ని కూడా అతికించే ప్రయత్నం ఇక్కడ జరగుతోంది…పనిలో పని సరదాగా తెలుగు అంకెలు నేర్చుకుందాం….

Telugu Numbers

ప్రకటనలు

నవరస నవలాకేళి…. ఈ వెన్నెల్లో ఆడపిల్ల

తెలుగు నవల చెరుపులు విరుపులు… సరస సరాగాలు… ప్రేమ, ఆర్థి, ఆర్థత పదాల అర్థం తెలుసుకోవాలంటే ఈ ఒక్క నవల చదివితే చాలదూ???

వెన్నెల్లో ఆడపిల్ల On Kinige

ఎక్కడ జ్ఞానం నిర్భయంగా, తల ఎత్తులు తిరగగలదో….

Ravindranth Tagore

ఎక్కడ జ్ఞానం నిర్భయంగా, తల ఎత్తులు తిరగగలదో,

ఎక్కడ విజ్ఞానం స్వేఛ్చావాయువులు పీల్చగలదో,

ఎక్కడ విశ్వం కుటిల యుద్ధరాజనీతికి ముక్కలవదో,

ఎక్కడ మాటలు సత్యాంతరాలంలోంచి ఉబికివస్తాయో,

ఎక్కడ అలుపులేని పోరాటపటిమే ప్రావీణ్యానికి చేతులు చాస్తుందో,

ఎక్కడ ప్రశ్నల ఝరి నిర్జీవపు అలవాట్ల ఇసుకతిన్నెల, నిస్సత్తువ ఎడారిలోకి దారి తప్పదో,

ఎక్కడ జ్ఞానం అనంతమైన ఆలోచనలలోకి నీవల్ల దారి చూపబడుతుందో,

ఆ స్వేచ్చా స్వర్గంలోకి, ఓ తండ్రీ, నా ఈ దేశాన్ని మేల్కొలుపు…

– రభీంధ్రనాథ్ ఠాగూర్

ఠాగూర్ మహాశయుడి మహాకవితల గీతాంజలికి నా చిరు అనువాదాంజలి…

యువరాజ్ సింగ్ – మరో రవిశాస్త్రి !

image_image010_gif01c77764_f37737e0.gif         Yuvaraj Striking         image_image010_gif01c77764_f37737e0.gif

18 వ ఓవర్లో వచ్చి 12 బంతుల్లో 6 సిక్స్‌లు 3 ఫోర్లు బాధి అర్ధ సెంచరీ (ఇది కూడా ఒక రికార్డే అనుకుంటా !? ) సాధించాడు, మరో భారత రవిశాస్త్రిగా అవతరించాడు… మన యువరాజ్ సింగ్… కీపిటప్… హీరో…

“పంజాగుట్ట ఫ్లైఓవర్”. రహదారి కాదది… యమదారి !

Panjagutta flyover

Panjagutta flyover

రామసేతువు కాలేని పంజాగుట్ట ఫ్లైఓవర్ యమపాశమైంది…..30* మంది ఉసురు తీసింది.

గంట క్రితం (21:00 IST) పంజాగుట్టలో కూలిన ఫ్లైఓవర్ నగరంలో కలకలం సృష్టించింది…మనం సాధించిన ప్రగతికి ఒక సవాల్ విసిరింది.

టార్గెట్..టార్గెట్.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేద్దామన్న తొందరలో విలువలకు తిలోదకాలిస్తే జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవని మరోసారి రుజువైంది.

సవరణ : దుర్ఘటన జరిగిన గంట తర్వత ఎస్సెమ్మెస్‌లు మరియు టీ.వి చానళ్ల ద్వారా అందిన ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ వార్త రాయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు రాత్రి పదకొండున్నర గంటలకు నిర్వహించిన సహాయక కార్యక్రమాలల్లో మృతుల సంఖ్య నలుగురిగా నిర్థారణ అయ్యింది. వారు:

అంకిత్ – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,

యం.డి.కుమార్ – కె.సంతోష్ రెడ్డి అనుచరుడు,

మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది.

సత్తా చూపిన భారత ఫుట్‌బాల్ జట్టు

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం…కలలాంటి నిజం…

తొలిసారి భారత ఫుట్‌బాల్ జట్టు, నెహ్రూ కప్పుని సగర్వంగా ఎత్తి చూపే దృశ్యం, నిజంగా కలలాగే అనిపిస్తోంది…ఇక

Indian Football team

సువర్ణాక్షరాలతో రాధ్దాం…..

                             కమాన్ ఇండియా….