ఏ మూల దాక్కుందో కేకేసి పిలువు

ఎవరి కోసం… ఎందుకోసం.. దేనికోసం… ఈ తాపత్రయం… నీ అంతులేని ఆత్రం…?

అంతరంగ తరంగంలోని అనురాగాన్ని అదిమిపట్టి, ప్రాపంచిక ప్రయోజనాలకి పాకులాడుతావు… ఎందుకోసం?
అనుచుకోలేని ఆవేశంతో అర్థహీనుడివౌతావు… దేనికోసం??

నీ ఇంటి వాకిట్లో నీలాలు రాలాలని నిశిరాత్రిలో నిలుచున్నావే….
పక్కింట్లో మనస్పర్ధలు ‘మనకెందుకులే’ నిట్టూర్పులో నీరుగారిపోతున్నా పట్టించుకోవా..!?
అడిగాను కదా అని పక్కింటి పంచాయతీకి పంచె ఎగగట్టి బయలుదేరావా…
నీ ఇంటి దేవతలు వృద్దాశ్రమంలో అనాథలుగా పడి ఉన్నారు, ఆ పంచె దించి పలకరించిరా ఒకసారి…!!

బందిపోటు రూపుదాల్చి, బల్లక్రింద చేయిపెట్టి, బడుగుజీవి బ్రతుకుకొట్టి… బ్యాంకుల్లో కూడబెడుతున్నావు..
నీ కాలికింది ఖరీదైన కార్పెట్ కోసమా? నీ భార్య ఒంటిపై వేసుకోలేనన్ని నగల కోసమా?? నీ పిల్లల పెళ్లిల్లకోసమా???

కారణాలు చెప్పే పనిలేదు… కనికరం ఏ మూల దాక్కుందో కేకేసి పిలువు.. !!!

ప్రకటనలు

కలవై వస్తావని..

నీ మాట వినని ఏ రేయినైనా..
నిదురేమిటో నా దరికి రాదు…
నిదుర వస్తే కూడా నిశ్చింతే నాకు..
కలవై వస్తావని.. కథలు చెప్తావని…

గంగమ్మ వాకిట్లో.. గన్నేరు చెట్టు… గన్నేరు చెట్టేమో విరగాభూసింది… (సరదాగా కాసేపు)

Gangamma Vaakitlo Ganneru Chettu

స్త్రీ|| గంగమ్మ వాకిట్లో.. గన్నేరు చెట్టు… గన్నేరు చెట్టేమో విరగాభూసింది…
కొమ్మ విరగకుండా.. కొయ్యండి పప్పు…. పప్పు తిన్నారంటే పాడెక్కెస్తారంతే…

పోయే కాలామొచ్చి…ఆ బ్రహ్మిగాడు.. పప్పు తెంపుకొని నమిలి మింగాడు..
ఆ నోట.. ఈ నోట… ఆ వార్త తెలిసి.. పరుగెత్తుకొచ్చాడు………… ఆర్.ఎం.పి కాట్ర.

పు|| రానే వచ్చాడోయమ్మ… ఆ కాట్రయ్య… వస్తూ చేసాడోయమ్మ ఏదో మాయ…
రానే వచ్చాడోయమ్మ… ఆ కాట్రయ్య… వస్తూ చేసాడోయమ్మ ఏదో… మాయ……

గంగమ్మ వాకిట్లో.. గన్నేరు చెట్టు… గన్నేరు చెట్టేమో విరగాభూసింది…
కొమ్మ విరగకుండా.. కొయ్యండి పప్పు…. పప్పు తిన్నారంటే పాడెక్కెస్తారంతే………. హో… హో…..

గమనిక: ఎంతోమందికి పరిచయమైన ఈ చిత్రం గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో దొరికింది. దీనితో గానీ దీని రూపకల్పనకిగానీ భాగ్యనగరం (ఈ భ్లాగు)కి ఎటువంటి సంబంధం లేదు. పైని పాట నాదే అయినప్పటికి.. ఇది ఏ దురుద్దేశ్యానికి లోనుకాకుండా స్వచ్చమైన మనసుతో పైనున్న చిత్రానికి అనుభూతిచెంది కొందరినైనా నవ్వించే ప్రయత్నంగా రాసాను.. స్వతహాగా మహేశ్‌ని మరియు మంచి చిత్రాలని అభిమానించే నేను ఈ చిత్ర విజయాన్ని మనస్పూర్థిగా ఆకాంక్షిస్తున్నాను.. -మీ ప్రవీణ్

A Page from my digital dairy.. what a magical change…

Tuesday, October 2, 2012 at 5:48am Toronto http://maps.google.com?q=43.670922,-79.381513+(Toronto) Happy birthday my lord Gandhi…. What a magical change am witnessing from past few days..!! I do not remember seeing a 5.30 morning so fresh and so vibrant. You may not believe, my mobile alarm still has some minutes to ring :-)… May be today it feeling jealous at my willpower for being setup 6AM everyday and for being forbidden with my new and enriched conciousness…. Yet some corner of my heart reminding me the great guy who, in all means had a great impact on my thoughts, implementations and actions. He is the guy who may have a overwhelming fan following at his best in all social networking sites.. but however am tributing my new acheivements and far new actions to the same guru personally at heart, to whom I always proud for being born in my generation.. Mr.Robin Sharma… my beloved motta boss :-)…. Shared with Memoires for Android http://market.android.com/details?id=net.nakvic.dromoris http://sites.google.com/site/drodiary/

నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో…

హాయ్ అంటే హలో అన్నవ్…
ఫోన్‍లో హలో అంటే, చాయ్‍కి చలో అన్నవ్…
జోకులేస్తే నవ్వినవ్ – కోపమొస్తే తన్నినవ్…
సోపతంటే సరేనన్నవ్ – ఎన్నేండ్లైనా తోడుంటనన్నవ్…
నా కండ్ల దుమ్ము వడితే – నీ కండ్ల నీళ్ళు తిరిగేటియి…

నీ కండ్లల్ల సూసుకుంటనే ’ఐ లవ్ యూ’ అంటి,
ఆలోచించుకుంటా అని చెప్పి జారుకుంటివి..
పదిదినాలకి పండ్లికిలిచ్చుకుంట ’సై’ అంటివి.
దునియాల నా అసోంటి పోటుగాడే లేడని –
మురిసేలా జేస్తివి..

తీరాకరికి పెండ్లి చేసుకుందాం అంటే,
మా అవ్వయ్య అద్దంటుర్రు – ’నన్ను యాదిమర్సిపో’ అంటివి…

నన్ను మరిసిపోయి – నీ గురించే సోంచాయించవడితి…
ఏట్ల మరిసిపోవాల్నే.. ఆ గుర్తుల్ని..!?

నా మదిలో రంది లేపితివి..
నా గుండెల్లో గునపం గుచ్చితివి..
నా మనసంటే గంత అలుసా..?
పాతకం తలుగుతది తెలుసా..!?

మళ్ల పుడితె గిట్ల, నీ కడుపునే పుడ్తా..
నీకు కడుపుకోత పెట్టి, బలవంతంగా చస్తా..
అపుడుగానీ నీకు తెలువది..
నా గుండెల్లో భాదేందో…
నీకొరకు అది పడే తపనేందో…!!!

ఉంటా,
నీ గుండెకి బైపాస్
ప్రవీణ్‍గాడు

ఆగస్టు 10 కి నాలుగు అందమైన కారణాలు

వచ్చింది… మా అమ్మ కల నెరవేరుస్తూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంట అడుగిడింది ఒక ఏంజల్…
తన లేలేత చేతులతో బుడి బుడి నడకలతో మా గుండెల్నిండా ఆనందాలు నింపడానికి దివి నుండి భువికి మా వదినమ్మ కడుపునుండి వచ్చేసింది.
మా రాముడికి ’లవకుశ’ పుట్టలేదని కాదు,లక్ష్మిలా మా లోగిలిలో నవ్వులు విరజిమ్మే పాప వచ్చిన సంతోషం కొన్నివేల రేట్లు ఎక్కువగా ఉంది.
మా అమ్మ ఎపుడూ అంటుంది… అమ్మాయికోసం చూడగా చూడగా నాల్గవవాడిగా నువ్వూ మగపిల్లాడివే అయ్యావు… నువ్వు అమ్మాయిలా పుడితే ఎంత బాగుండేదిరా అని..
సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత తన పెద్దకొడుకే తనకి పాపని కానుకగా ఇవ్వడం ఇంకా నా మదిలో స్వచ్చంగా ఒక మరుపురాని అనుభూతిగా మిగిలి ఉంది.
నిస్సారంగా సాగుతున్న మా జీవితాల్లో వెలుగులు నింపడానికి వేంచేసిన మా పెద్ధన్నయ్య పాపకి ఈ చిన్ని బాబాయి తరఫున సాదర స్వాగతం…
పుట్టిన సమయం: సాయంత్రం 4.37 ని||లు
ఈరోజు ఇంకా విశేషాలు ఎంటంటే….
మా చిన్నన్నయ్య పుట్టినరోజు ఈరోజే..
మా మంచి బాబాయి అంజయ్య గారి పుట్టినరోజూ ఈరోజే..
మా మేనమామ కూతురు పుట్టింది కుడా ఈరోజే…
అంటే ఆగస్టు 10 ని గుర్తుంచుకోవడానికి నేడు నాలుగు అందమైన కారణాలు…

వచ్చింది… మా అమ్మ కల నెరవేరుస్తూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంట అడుగిడింది ఒక ఏంజల్…

తన లేలేత చేతులతో బుడి బుడి నడకలతో మా గుండెల్నిండా ఆనందాలు నింపడానికి దివి నుండి భువికి మా వదినమ్మ కడుపునుండి వచ్చేసింది.

మా రాముడికి ’లవకుశ’ పుట్టలేదని కాదు,లక్ష్మిలా మా లోగిలిలో నవ్వులు విరజిమ్మే పాప వచ్చిన సంతోషం కొన్నివేల రేట్లు ఎక్కువగా ఉంది.

మా అమ్మ ఎపుడూ అంటుంది… అమ్మాయికోసం చూడగా చూడగా నాల్గవవాడిగా నువ్వూ మగపిల్లాడివే అయ్యావు… నువ్వు అమ్మాయిలా పుడితే ఎంత బాగుండేదిరా అని..

సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత తన పెద్దకొడుకే తనకి పాపని కానుకగా ఇవ్వడం ఇంకా నా మదిలో స్వచ్చంగా ఒక మరుపురాని అనుభూతిగా మిగిలి ఉంది.

నిస్సారంగా సాగుతున్న మా జీవితాల్లో వెలుగులు నింపడానికి వేంచేసిన మా పెద్ధన్నయ్య పాపకి ఈ చిన్ని బాబాయి తరఫున సాదర స్వాగతం…

పుట్టిన సమయం: సాయంత్రం 4.37 ని||లు

ఈరోజు ఇంకా విశేషాలు ఎంటంటే….

మా చిన్నన్నయ్య పుట్టినరోజు ఈరోజే..

మా మంచి బాబాయి అంజయ్య గారి పుట్టినరోజూ ఈరోజే..

మా మేనమామ కూతురు పుట్టింది కుడా ఈరోజే…

అంటే ఆగస్టు 10 ని గుర్తుంచుకోవడానికి నేడు నాలుగు అందమైన కారణాలు…

నా డైరీ మరో పేజీ

నాడు:

కవ్వింపుల కనుచూపుల్లో పుట్టిన నా కలల విత్తనం..

తన చిరునవ్వుల చిరుజల్లుల్లో తడిసి మొలకెత్తి..

మా ఆశల ఊపిరి పీల్చుతూ  పెరిగింది… మొక్కయింది.

నేడు:

ఆశేలేని వేడి ఆవిరిలో అవిసి..

జీవమేలేని నవ్వులో సజీవంగా మసిబారి..

నా కన్నీటి సంద్రంలో జలసమాధి అయింది… మరిణించింది.

అయినా….

తనకి బహుమతిగా ఇచ్చిన నా ఆశల గాజు శిల్పాన్ని విసిరికొట్టి విదిలించుకొనివెళ్లినా….

నిందించను తనని…!

ఎందుకంటే,

ఆ కరకు మాటల మాటున తన మనసేంటో తెలియదు నాకు…

తెలపనేలేదు.. తన నాకు….