మరణం…

మరణం…

జీవితంలో ఎన్నో సంధర్బాలకి, సంఘర్షణలకి, సంఘటనలకి ముందస్తుగా సిద్దపడి, తగిన జాగ్రత్తలు తీసుకునే మనం.. ఈ ఒక్క మరణం అనే విషయంలో మాత్రం ఎందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోము? ఎందుకంత నిర్లక్ష్యం?

ఒక మధ్యతరగతి ఉధ్యోగి కలలు కంటాడు.. తను రిటైర్ అయ్యే సమయానికి కొడుకులిద్దరు మంచి ఉధ్యోగాల్లో స్థిరపడాలని, పెళ్లిల్లు చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని.. చివరి రోజుల్లో ఎలాంటి బాధరబంధి లేకుండా కన్ను మూయాలని..

అతని భార్య కలలు కంటుంది.. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు స్థిరపడి ఇల్లు కలకలలాడాలని..

కోడుకులు ఆశ పడతారు.. ఒక మంచి ఉధ్యోగం సంపాదించి, స్థిరపడి, ఒక మంచి అమ్మాయిని పెళ్లిచేసుకొని, భార్యా పిల్లలతో అమ్మానాన్నలతో సంతోషంగా బతకాలని..

అందరూ దాదాపుగా ఇవే, లేదా ఇలాంటి ఆశలతో తమ జీవితాలకి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని అందిపుచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతూ.. ఆ పోరాటంలో, అత్యంత కీలకమైన… మరియు వీటన్నింటికి అత్యావశ్యకమైన ఆరోగ్యాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో అర్ధం కాదు ఒక్కొక్కసారి..

షుగర్ లెవల్ 500 పైకి ఎగబాకినా, బి.పి 200/120 మించిపోయినా, ఛాతిలో మంటగా ఉన్నా, ఎన్నో రాత్రుల్లు నిద్రపట్టకపోయినా, ప్రతిరోజు మందుకి భానిసైనా ఎందుకంత ఉదాసీనత? ఆ లక్షణాలన్ని ప్రాణాంతకమని తెలిసినా ఎందుకంత నిర్లక్ష్యం?

ఇప్పుడు ఆ చిన్ని కుటుంబంలో… ఆ తండ్రి అకాల మరణం చేసినా, ఆ తల్లి అర్ధాంతరంగా గతించినా, ఆ పిల్లలు ఏదో ఒక రోడ్డు దుర్ఘటనలో చిన్నవయసులో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి కలిగే మానసిక క్షోభ వర్ణనాతీతం.. కేవలం అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది…

Friends, అలాంటి పరిస్థితుల్లో మీరుగాని, మీకు తెలిసిన వాళ్లుగాని ఉంటే, దయచేసి సరైన సమయంలో సరైన వైద్యపరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండండి..

చివరగా ఒక్క మాట… మీ చేతుల్లో… కేవలం మీ జీవితం మాత్రమే కాదు, మీ వాళ్ల సంతోషం కూడా ఉందని మరచిపోకండి.