ర్యాగింగ్…

ఒక కుర్రవాడు హైద్రాబాద్ లో చదువు ముగించుకొని ఉద్యోగరిత్యా ఒక పల్లెటూరికి పయనమౌతాడు. అక్కడ ఒక భూస్వామి దగ్గర 5 వేల రూపాయలకి (ఉధ్యోగిలా కాదు, జీతగాడిగా…) పనికి కుదురుతాడు ఓరోజు…

భూస్వామి: ఏం పిలగా నిన్ననే వస్తా అని రాలే, ఏమైంది?
జీతగాడు: మొదటిసారి మా ఊరు వదిలిపెట్టి వచ్చాను కదా సార్, ఏడుపొచ్చింది. Facebook లో status update చేస్తే తెలిసినవాళ్లందరూ ఓదార్చారు..
——–అందుకే నిన్న పనికి రావాలనిపించలేదు, ఏమనుకోకండి..

భూ: ఏందో నీ గోళ, అందుకే ఈ చదువుకున్న పిలగాడిన జీతంల పెట్టుకునుడు వద్దంటే వింటుందా మా ఆవిడ..

(గొడ్లచావిడి లోనుండి) అంబా…… తౌడ్….. అంబాఆఆ…..

భూ: అదిగో ఆ బర్రెలు ఎందుకో అరుస్తున్నయ్… మీ అమ్మగారు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. నువ్ వెళ్లి వాటికేంకావాలో వేసి, మనకేంకావాలో తీసుకొనిరా…

(గొడ్లచావిడి లోనుండి) అంబాఆఆఆఆఆఆ…… తౌడ్‍డ్‍డ్‍డ్‍డ్‍……..

భూ: ఇంకా ఏంచూస్తునవ్ పో,. జల్ది..

జీ: (కోపం, చిరాకు, భాధ, భయం కలగలిపి) .. అలాగే సార్…

~~~~~ గొడ్ల చావిడిలో ~~~~~

జీతగాడు: ఏవండీ… ఇక్కడ బర్రె అంటే ఎవరండీ..!?
పశువు: తెలియకడుగుతున్నవా… తెలుసుకోవాలనడుగుతున్నవా?….. నేనే !! ఏంది సంగతి ?
Buffallo

జీ: (అమాయకంగా..) ఇందాకటినుండి అరుస్తున్నారు.. ఏం కావాలండీ!?
ప: (కడుపులో దాచుకున్న గడ్డిని సుతారంగా నెమరువేస్తూ..) ఎవ్వడ్ భే నువ్వ్ ?? ఇంతకుముందు ఇటుమొకాన నిన్ను చూసినట్టులేదు.. కొత్తగచ్చినవా??
జీ: అవునండీ.. నా పేరు రామక్రిష్ణ.. నిన్ననే పనిలో కుదిరా..!
ప: నా దగ్గరకొచ్చి నాగురించి నన్నే అడిగితే, గదే అనుకున్న కొత్తపోరనివని… ఏం పీకుదామని పనిలో కుదిరనవ్?
జీ: (అమాయకంగా..) సార్ ఏం పీకమంటే అది పీకుదామని అనుకుంటున్నానండి..
ప: (మనసులో..) ఇదేదో బకరా ఉన్నట్టుంది… ఒక చూపు చూడాల్సిందే!!!
(బయటకి) గట్లనే పీకుదువుతియ్ గనీ.. ముందు పొయ్ గడ్డి తీసుకరా… నిన్నటినుండి ఈ ఎండు గడ్డి నమిలీ నమిలీ దవడలు దంగుతున్నయ్..
జీ: అలాగేనండీ…
(వెళ్లి.. నాలుగు పచ్చని గడ్డి పరకలు తెచ్చి వేస్తాడు…)

ప: (కోపంగా..) ఏంరా, ఎట్ల కనిపిస్తున్న నేన్ నీకు… నా దుడ్డె ఒక పన్నుకిందికి రావు ఆ గడ్డి పరకలు…
(కళ్లు పెద్దవి చేసి… కుమ్మబోతున్నట్టు విదిలిస్తూ..) పొయ్ మోపు తీసుకరాపోరా..!!!
జీ: (దడుసుకొని)… సారీ అండి, తెలియక..
(ఏడుస్తూవెళ్ళి… పెద్దమోపు తెచ్చి వేశాడు…)

ప: ఏంరా, చిన్నపోరనిలెక్క ఏడుస్తున్నవ్? తిక్కరేగితే నేను గట్లనే ఒర్లుతగనీ… లైట్ తీస్కోని కండ్లు తుడ్సుకో..
జీ: (కండ్లు తుడుచుకుంటూ) అలాగేనండి…
ప: (Full Concentrationతో గడ్డిని తింటూ..) ఇంతకీ ఏం చదివినవ్‍రా?
జీ: B.Tech, specilization in I.T అండీ
ప: (తలపైకెత్తి) అంటే మా సార్ కొడుకు సదివేదేకదా!? ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు మేనేజిమెంట్ ల ఫీజ్ కట్టి జాయిన్ అయిండు.. నా దుడ్డె కూడా ఈడుకొచ్చింది కానీ, వాని సదువుఅయితే అయితలేదు.. ఏం సదువో ఎమో ఎ..ద..వ… (మళ్ళీ కొంచెం గడ్డి కరుచుకొని)
అయినా వాడు ఇంట్లో ఉండగా నిన్నెందుకు పనిలో పెట్టుకున్నారో ఎరుకనేనా??
జీ: తెలియదండి…!?!
ప: వాడు నా వీపుతోమడానికి కూడా పనికిరాడని.. (క్రిందపడి పడీ పడీ దొర్లుతూ… హ్హహ్హహ్హహ హ హ…)
జీ: (ముసిముసిగా నవ్వుతున్నాడు..)

ప: (మెల్లిగాలేచి నిలబడి) చానారోజులైందిరా ఇలా నవ్వుకొని… అవుగనీ పట్నంల గన్ని గన్ని కంపెనీలుండగా గీడికొచ్చినవేందీ??
జీ: Freshersకి OPenings లేవు.. Backdoorలో డబ్బులు అడుగుతున్నారు…
ప: కట్టకపోయినవా??
జీ: (రోషంగా) అయ్యకులేక అయిదు అంటే, కొడుకచ్చి కోటి అడిగిండంట… ఆ పైసలే ఉంటే, గిట్ల నీ వీపుతోమే ఖర్మ ఏంటినాకు!??
ప: ఏమ్‍రా నఖరాలా? ఎక్కువ తక్కువ కథల్ పడితివంటే కోసి కారం పెడుత బిడ్డ ఏమనుకుంటున్నవో…. నాదసలే హైద్రాబాద్..!!
జీ: (బిక్కమొఖం వేసి) నేను చదువుకుంది కూడా హైద్రాబాద్‍లోనేనండి..
ప: అవున్లే ఈ మధ్య ఇంటర్ అయిపోంగనే కుక్కలు కూడా CAT కార్డ్ తీస్కొని హైద్రాబాద్ ఎర్రబస్సెక్కుతున్నయంట కదా!!? (మళ్లీ క్రిందపడి దొర్లుతూ…)
జీ: (ఏడుపుమొఖం పెట్టాడు.. 😦 )

ప: (మళ్లీ కొంచెం గడ్డి కరుచుకొని) సరేగానీ, ఇంతకీ జీతమెంతిస్తా అన్నడురా మన సార్ గాడు?
జీ: (నిశ్శబ్ధంగా నేలకేసి చూస్తూ ఉన్నాడు… ఏడుపుమొఖంతో)
ప: ఏ… ఊకోరా భయ్.. ఏదో మజాక్ చేస్తే సీరియస్ తీసుకుంటున్నవ్…
జీ: (మెల్లిగా కళ్లు తుడుచుకుంటున్నాడు..)
ప: ఓ..హో..హో… గిట్లైతే మస్తు కష్టంరా.. ఎంతైనా మీ సదువుకున్నోళ్లు లవు సుకుమారంరా…
జీ: అదేం కాదండి… పెద్దవాళ్లు తిడితేనే ఏడుపొస్తుంది.
ప: ఓయ్.. ఎవడ్ భే పెద్ద? ఏదో బర్రెలెక్క పుట్టిన కాబట్టి ఇట్ల బలిసిన కనీ (తన దేహాన్ని తనివితీరా చూస్తూ)…
నా వయసెంతర… (కాలు నేలకేసి రాస్తూ.. సిగ్గుపడుతూ) మొన్ననే నాలుగు పోయి అయిదు పడ్డయ్…

జీ: అవునా….!!!! నమ్మలేకపోతున్నానండి… అయినా మరి మీరెందుకు హైద్రాబాద్ నుండి ఇక్కడకి వచ్చారు?
ప: ఈ ఇంటికి ముందెవడచ్చిండ్రా?
జీ: మీరే…!
ప: అంటే సీనియర్ ఎవడ్రా?
జీ: మీ…రే……!!
ప: మరి Questions ఎందుకడుగుతున్నవురా!?
జీ: (ఖంగుతిని) సారీ అండి..
ప: ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటే, నా బిడ్డకు కూడా నువ్వే వీపుతోముతవ్ Future లో.. లేదనుకో నీ వీపు నేను తోముత… Present లో.
జీ: అలాగేనండీ…
ప: నీ అండిల నా పెండ పెడుతగనీ… నీ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ గురించి రెండుముక్కలు చెప్పు.. (షరామామూలుగా గడ్డి కరుచుకొని)
జీ: (ఉత్సాహంగా.. 😀 ) మా ఊరు కందలపాడండి.. పక్కనే ఉన్న టౌన్లో అరవింద్ అనే సినిమా హాలు ఉందండీ… ఆ హాలులో..
ప: బఠానీలు అమ్మేటొనివా!?
జీ: ఛీ, కాదండి.. ప్రతివారాంతం సినిమా చూసేవాన్నండి. నా స్నేహితులు రాజు, సురేశ్, బాబు, మహేందర్, వేణుగోపాల్, రాజేశ్, మహేశ్.. ఇంకా… ఇంకా… కొంతమంది ఉన్నారండి.
అందులో సురేశ్, బాబు దుబాయ్ వెళ్లారండి, వారంవారం ఫోన్ చేస్తారండీ.. మరేమో… మహేందర్, మహేశ్, ఇంక రాజులు ఇంకా చదువుకుంటున్నారండి… ఇంక మరేమో…
ప: ఏయ్… ఆపుభే నీ లొల్లి… (గట్టిగా దబాయించి)
జీ: (బిక్కమొఖం పెట్టాడు.. 😦 )
ప: రెండుముక్కలు చెప్పుర అంటే, చాట భారతం చెపుతవేందిర.. మనసున పడతలేదా ఏంది?
నీతోని ఇట్ల నడువదిగని… ముందు అచ్చిన పని కానీయ్… సాయంత్రం పెండ ఎత్తడాన్కి వస్తవ్ కదా అప్పుడు పెడదంతియ్ మన సోది..
(అని తనకు నచ్చిన గడ్డిని తినడానికి ఉధ్యుక్తమైంది)..

జీ: (భాధగా కదిలుతూ..) అలాగేనండి.
(చెంబు చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చోని, పాలు పితుకుదామని పశువు కింద పట్టుకుంటాడు… అలా పట్టుకోగానే సడెన్ గా షాక్ తగిలినట్టై పశువు వెనకకి తల తిప్పి చూసింది)
ప: అనుకున్నరా… ఇట్లాంటిదేదో చేస్తవని..
జీ: నేనేం చేశానండి (అయోమయంగా ఫేసు పెట్టి)???
ప: ఏం చేయడానికి పంపిండు సార్ నిన్ను??
జీ: పాలు పితకడానికి….!!
ప: మరి నువ్వేం పట్టుకున్నవ్!?
జీ: (షాక్ తగిలి, పట్టు తప్పి, వెనక్కి వాలి..) అంటే నువ్వు…
ప: YES. బర్రెని కాదు దున్నపోతుని..
జీ: మరి బర్రె ఎవరూ అని అడిగితే మీరే అని అన్నారు?

ప: ఉత్తినే మజాక్ చేసిన (కన్ను కొట్టింది… 😉 )

~~~~~ సమాప్తం ~~~~~

తరువాయి భాగం చదవాలనిపిస్తే… ఇక్కడ నొక్కండి

ప్రకటనలు

10 thoughts on “ర్యాగింగ్…

  1. ప్రవీణ్ గారు,
    మీ బాతాఖానీ కబుర్లు చదువుతుంటే ముళ్ళపూడిగారి విక్రమార్కుడి మార్కుసింహాసనంలో రాజు పాత్ర గుర్తొచ్చి నవ్వొచ్చింది. తెలంగాణ మాండలికం చక్కగా పండింది. బాగా రాసారు.

  2. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి. ఇట్లు నిర్వాహకులు

  3. పింగుబ్యాకు: దున్నపోతీయం–రెండవభాగం | భాగ్యనగరం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s