నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో…

హాయ్ అంటే హలో అన్నవ్…
ఫోన్‍లో హలో అంటే, చాయ్‍కి చలో అన్నవ్…
జోకులేస్తే నవ్వినవ్ – కోపమొస్తే తన్నినవ్…
సోపతంటే సరేనన్నవ్ – ఎన్నేండ్లైనా తోడుంటనన్నవ్…
నా కండ్ల దుమ్ము వడితే – నీ కండ్ల నీళ్ళు తిరిగేటియి…

నీ కండ్లల్ల సూసుకుంటనే ’ఐ లవ్ యూ’ అంటి,
ఆలోచించుకుంటా అని చెప్పి జారుకుంటివి..
పదిదినాలకి పండ్లికిలిచ్చుకుంట ’సై’ అంటివి.
దునియాల నా అసోంటి పోటుగాడే లేడని –
మురిసేలా జేస్తివి..

తీరాకరికి పెండ్లి చేసుకుందాం అంటే,
మా అవ్వయ్య అద్దంటుర్రు – ’నన్ను యాదిమర్సిపో’ అంటివి…

నన్ను మరిసిపోయి – నీ గురించే సోంచాయించవడితి…
ఏట్ల మరిసిపోవాల్నే.. ఆ గుర్తుల్ని..!?

నా మదిలో రంది లేపితివి..
నా గుండెల్లో గునపం గుచ్చితివి..
నా మనసంటే గంత అలుసా..?
పాతకం తలుగుతది తెలుసా..!?

మళ్ల పుడితె గిట్ల, నీ కడుపునే పుడ్తా..
నీకు కడుపుకోత పెట్టి, బలవంతంగా చస్తా..
అపుడుగానీ నీకు తెలువది..
నా గుండెల్లో భాదేందో…
నీకొరకు అది పడే తపనేందో…!!!

ఉంటా,
నీ గుండెకి బైపాస్
ప్రవీణ్‍గాడు

ప్రకటనలు

7 thoughts on “నీకు తెలువది.. నా గుండెల్లో భాదేందో…

  • నందాజీ, నా మాటల్గిన
   నీ మనసుకి కష్తమైతె మనసుకు తీసుకోకు
   నాపై కోపం తెచ్చుకోకు.
   నీ కయిత శానమంచిగుంది తమ్మీ
   గనీ
   సందర్బమేదైతెనేమ్లే గాని,
   “మళ్ల పుడితె గిట్ల, నీ కడుపునే పుడ్తా..
   నీకు కడుపుకోత పెట్టి, బలవంతంగా చస్తా”
   గిసుమంటి మాటల్ల…..అస్సల్…..
   సంపుడెందుకు? సచ్చుడెందుకు?
   వుండెడ్ది బతుకొక్కటె గంద?మంచిగ బతుకితె పాయె.
   మనసుల గసువంటి కసి పెంచుకోకు, యువతలోపెంచకు తమ్మీ
   కవి సెప్పంగలేంది ,నేజేస్తె తప్పెట్లయితదనీ
   సంకేతం యువతకు జేరిందన్కో శాన కష్టమైతది
   గిట్లనె యాసిడు దాళ్ళయితన్నయ్ గంద? .
   దిన దినాం సమాజం శాన సున్నితమైతలేద ?
   సచ్చెడిదెందుకు?మల్ల బుట్టి సంపి సచ్చెడిదెందుకు?

   • రాఘవన్న… నువ్వు చెప్పినయి మంచిమాటలే గదనే.. గిండ్ల కోపం జెయ్యడానికి ఏముంది.

    కాకపోతే ఒక చిన్న అపార్ధం జరిగిపోయినట్టు నాకు అర్థమైతాంది.

    నేను అ(నాలనుకు)న్నది ఏందంటే..

    “మళ్ళీ జన్మంటూ ఉంటే గిన (దానికోసం నేనేమి ఇప్పుడు బలవంతంగ సావ.. ఎందుకంటే, పుట్టుడు మనసేతుల్ల లేనప్పుడు, సావుడు మన సేతుల్లల్లకు ఎందుకు తీసుకోవాలె?), నేను నీ కడుపుల పుడుత (ప్రేమికుడిగ పోందలేని నీ ప్రేమ కనీసం నీ తల్లి లాలనలోనైన పోందచ్చని)..”

    “గప్పుడు నీ బిడ్డలెక్క బతికే నేనుగనక సస్తే [ఈసారి బలవంతంగానే కాకా:( ] నీకు కలిగే కడుపుకోత (ఒక తల్లికి కలిగే కడుపుకోత, నిజంగా కడుపు (కి)+కోత కాదు) ఎంత భాదాకరంగా ఉంటదో, గిప్పుడు నేను పడె బాధ గంతకంటె ఎక్కువగా ఉంది”.. అనేగానీ, నన్ను కాదన్నందుకు ఆమెని చంపాలనో నేను సావాలనో కాదుకాక.

    ఎందుకంటే, ఎవరికి నచ్చిన వాళ్లను ప్రేమించే హక్కు ప్రతి మనిషికి ఆ దేవుడు ఇచ్చిండు కదా, కాదనడానికి నేనెవరిని…

    – ప్రవీణ్

 1. నమస్తే, ప్రవీణ్ నేను యాదికి ఉన్ననా?
  బలె కవిత్వాలు రాత్తున్నవ్ నేన్నియ్యాలనే చుసినా, చూసుడేంది చదివిన కాని ఒక్క దగ్గర కొంచమ్ ఏదో జరిగిందని గిట్ల సిన్న ముక్క రాద్దాం అనగనే
  Nutakki Raghavendra Rao అన్న నా మనసులో ఉన్నది లాక్కుని మరీ సెప్పిండు,
  దానికి నీ జవాబు కూడా ఇచ్చేసావ్…..
  సరే గిసొంటియి ఇంకా మంచి కవిత్వాలు రాయాలి అందరిని ఖుష్ చెయ్యాలె….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s