మార్చినెల తెలుగు బ్లాగర్ల సమావేశం – హైదరాబాద్

[ ముందుమాట ]

సమయం : 3-28 ని||లు    స్థలం : జూబ్లిహిల్స్ దారిలో ఆర్.టి.సి బస్సు

నిర్ధేశిత సమయానికి 28 ని||లు అప్పటికే ఆలస్యమైంది. తాజా సమాచారం కోసం వీవెన్ గారికి మొట్టమొదటిసారిగా కాల్ చేశాను.

నేను : వీవెన్‍గారు , నేను ప్రవీణ్‍కుమార్ నండి !
వీవెన్ : నందగిరి గారా ?
ప్ర: అవునండి….
వీ: చెప్పండి
ప్ర: జూబ్లిహిల్స్ దగ్గర్లో బస్‍లో ఉన్నాను. ఒక పావుగంటలో వస్తానండి. కార్యక్రమం ఎక్కడవరకు వచ్చింది ?
వీ: ఇప్పుడే పార్క్ లోకి వెళ్తున్నామండి. పర్లేదు రండి.
ప్ర: సరే… వస్తున్నానండి. (కాల్ డ్రాప్ చేశాను. మనసు కాస్త స్థిమిత పడింది)

మరో 15 ని||లల్లో కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. లోనికి వెళ్తూ, వీవెన్ గారికి మళ్లీ ఫోన్‍చేసి సమావేశ స్థలానికి దారి కనుక్కొని, 2 ని||ల్లో అక్కడకి చేరుకున్నాను.

[ సమావేశం ]

        ఒక చిన్న మానవచక్రం పచ్చిక బయళ్లల్లో సేదతీరుతోంది. 8 మంది ఉండొచ్చు. కాస్త బిడియంగానే వెళ్లి, ఆ చక్రంలో భాగస్వామినయ్యాను. అప్పటికే ‘నా ప్రపంచం’ సి.బి.రావు (సింపుల్‍గా రావు గారు అనుకుందాం), వీవెన్ మరియు త్రివిక్రమ్‍గారితో ‘శోధన’ లో ఉంచబడిన బ్లాగ్ ర్యాంకింగ్‍ల గురించి చర్చిస్తున్నారు. అంతలోనే ‘శోధన’ సుధాకర్‍గార్ రానే వచ్చారు, చేతిలో డిజిటల్ కెమెరాతో…

          మరి కాసేపటికి ‘చదువరి’ కిషోర్* గారు, ‘సత్యశోధన’ సత్యసాయిగారు(వారి అమ్మాయి శ్రావ్యవరాళి గారితో కలిసి), ‘ఈనాడు-పెన్’ శర్మగారు(వారి సతీమని, కుమార్తె సుమబాల, స్నేహితుడు శాస్త్రిగారితో కలిసి), ‘హరివిల్లు’ శ్రీనివాస్‍గారు, ‘ఈనాడు-క్లిక్’ వసంత్‍గారు, జాన్‍హైడ్ కనుమూరి గారు, చివరగా ‘ఆదిబ్లాగర్’ చావాకిరణ్‍గారు విచ్చేసారు.

      20 మంది వరకు సభ్యులు చేరాక, పరిచయ కార్యక్రమాలు మొదలై – పూర్తవగానే, రావుగారు ‘శోధన’లో ప్రచురించబడిన బ్లాగ్‍ర్యాంకింగ్‍లపైన చర్చ లేవనెత్తారు. అరగంటపాటు చాలా రసవత్తరంగా సాగిందా చర్చాకార్యక్రమం. సరదాకి అదొక వా(బ్లా)గ్యుద్ధమనుకోవొచ్చు. ఇక్కడ ‘రసవత్తరం’గా అని ఎందుకన్నానంటే, ఆ అరగంటలో దాదాపు ప్రతీ బ్లాగరు, ‘శోధన’ సుధాకర్‍గారు చెప్పిన ఏదో ఒక విషయాన్ని వారి బ్లాగ్‍కి అన్వయించుకొని ఉంటారు. ఆ చిరు యుద్ధానికి ముగింపు వాక్యంగా “ఎవరి బ్లాగ్‍కి వారే సు-మ-న్” ను అందరూ అమోదించారు.(థాంక్యూ సుధాకర్‍గారు! బ్లాగ్, వెబ్‍సైట్ ల మధ్య ఉన్న అతిసన్నని తేడాని విడమర్చి చెప్పి ఇన్నిరోజుల నా సంధిగ్ధాన్ని తొలగించినందుకు…)

     ఇక రెండవ చర్చ వీవెన్‍గారి తరఫున జరిగింది. ‘Betawiki’ గురించి కాసేపు వివరించారు. దాని ప్రకారం బీటావికీ మూడింటికై ఉద్దేశించింది:
1. మీడియావికీని, దాని పొడగింతలు మరియు ఇతర ప్రాజెక్టులని అనువదించడానికి ఓ వేదిక
2. వాటిని నడిపే వికాసకులకి పరీక్షా వేదిక
3. వికీలో అన్యభాషలు రాక దారితప్పిన బాటసారులకి ఒక ‘సైన్‍బోర్డ్’ లాంటిది.

      ఈ బీటావికిపైన పద్మనాభం గారు మరియు వెంకటరమణగారు కొన్ని సందేహాలు వెలిబుచ్చినా, అవి వెంటనే నివృత్తి చేయబడ్డాయి.

     RTS, తెలుగు అనువాద సమీకరణలు, కొత్త బ్లాగర్ల చేరికను ఇతర అంశాలుగా చర్చించారు. (RTS గురించి నాకేమి తెలియదు కాబట్టి, మీకేమి చెప్పలేను. క్షమించాలి). జాన్‍హైడ్ కనుమూరి గారి నూతన (మూడవ) రచన ‘అలలపై కలలతీగ’ కొన్ని ప్రతులను సభ్యులకి అందజేశారు.

     చీకటి పడుతుండగా ‘క్లిక్’ వసంత్‍గారు, శర్మ & కో. గార్లు, సత్యసాయి మరియు వారి కుమార్తె నిష్ర్కమించారు. మిగిలిన వారు అలా అలా నడుస్తూ Cafetaria కి చేరుకొని టీ కాఫి లాంటివి సేవించి, వాటికంటే వేడిగా  రాజకీయాలగురించి చర్చించుకొని ఒక్కక్కరుగా నిష్ర్కమించడానికి ఉద్యుక్తులమయ్యాం.

[ సమావేశంలో చమక్కులు ]

1. పదే పదే, “ఎవరి బ్లాగ్‍కు వారే సు-మ-న్” అనే వాక్యం విన్పించింది!


2. కొత్తగా పెళ్లయిన త్రివిక్రమ్‍గారిని పెద్దలు “కళ్యాణాయ – బ్లాగ్ వినాశాయ:” అంటూ తన బ్లాగ్విరామాన్ని గుర్తుచేసుకున్నారు (నవ్వులు…)


3. సత్యసాయిగారు వారి అమ్మాయిని పరిచయం చేస్తూ, “మా అమ్మాయి మొన్నే 7వ తరగతి పూర్తిచేసి..” అంటూ చెప్పేలోపే శ్రావ్యవరాళి గారు కల్పించుకుంటూ…”నాన్న! నేను పూర్తిచేసింది 7 కాదు, 8వ తరగతి…” అనగానే నవ్వులు విరిశాయి.


4. శర్మగారి పాప ‘సుమబాల’ అందరిమధ్యన చలాకీగా తిరిగింది. సరదాగా తనకి ‘బాల బ్లాగర్’ బిరుదిచ్చారు.


5. అలాగే పనిలో పనిగా ‘ఆది బ్లాగర్’ చావాకిరణ్‍గారికి ‘మెగా బ్లాగర్’, ‘పద్మ బ్లాగర్’ మరియు ‘బ్లాగ్ నన్నయ’ లాంటి బిరుదులను ప్రధానం చేద్దామనుకుని అడగగా, తను తన ‘ఆది’ పదవికి రాజీనామా సమర్పిస్తున్నానని చెప్పారు (నవ్వుతూ..), కానీ సభ అమోదించలేదు.

6. ‘లేఖిని’ మరియు ‘కూడలి’ లతో రెండు కళ్లు తెరిచిన వీవెన్‍గారిని ‘మూడో’కన్ను కూడా తెరవాల్సిందిగా సభికులు కోరారు.

7. సత్యసాయి గారు తెచ్చిన ‘స్వగృహ’సున్నుండలు clockwiseలోనూ, వేరొక సభ్యులు* తెచ్చిన మసాలా స్నాక్స్ Anti-clockwiseలోనూ తిరిగి అందరి నోటికి కాసేపు ఆనందాన్ని పంచాయి.

8. బ్లాగర్లు కాని ‘ఆ నలుగురు’ సభ్యులు :

         1. పద్మనాభంగారి మిత్రులు నరసింహారావుగారు (రిటైర్మెంట్ దగ్గరలో…)
2. శర్మగారి మిత్రులు శాస్త్రి*గారు (M.C.A పూర్తిచేశారు…)
3. సత్యసాయిగారి కుమార్తె శ్రావ్యవరాళి గారు (9వ తరగతి విధ్యార్థిని…)
4. శర్మగారి సతీమణి మరియు పాప (2 సం||లు…)

* అనుకుంటా

[ వచ్చినవారు – clockwise seating order]

జాన్‍హైడ్ కనుమూరి
‘భాగ్యనగరం’ ప్రవీణ్
సత్యసాయిగారి కుమార్తె శ్రావ్యవరాళి
‘సత్యశోధన’ సత్యసాయి
‘హరివిల్లు’ శ్రీనివాస్
‘పొద్దు’ త్రివిక్రమ్
‘బ్లూటూత్’ కశ్యప్
‘శోధన’ సుధాకర్
‘కూడలి’ వీవెన్
‘ఆదిబ్లాగరి’ చావాకిరణ్
‘సింపుల్’ వెంకటరమణ
‘జాబిల్లి’ విజయ్‍కుమార్
‘ఈనాడు-పెన్’ శర్మ
శర్మగారి సతీమణి
శర్మగారి కుమార్తె సుమబాల
శాస్త్రిగారు
‘ఈనాడు-క్లిక్’ వసంత్‍
‘చదువరి’ కిషోర్‍
‘నా ప్రపంచం’ సి.బి.రావు
‘క్రుకీలు’ కృష్ణ
నరసింహరావుగారు
‘గ్రీటింగ్స్ తాతయ్య’ పద్మనాభంగారు

‘జాబిల్లి’ విజయ్‍గారు ఈ-తెలుగులో రాయడానికి ఈ సమావేశాపు వ్యాసాన్ని దత్తత తీసుకున్నారు. వీవెన్ గారు వ్యాసాన్ని నా బ్లాగ్‍లో రాయాల్సిందిగా సమావేశానికి మొదటిసారి హాజరైన నన్ను నియమించారు   ( 😦 కానీ వివరాలేమి అందించలేదు). కావున నా మదిలో దాచిన అన్ని జ్ఞాపకాలను ఇక్కడ ఉంచే ప్రయత్నం చేశాను, ఏవైనా మరచిఉంటే పెద్దమనసుతో క్షమించగలరు…

వచనం : ‘ప్రణభాంకుర’ నందగిరి ప్రవీణ్ కుమార్

ప్రకటనలు

23 thoughts on “మార్చినెల తెలుగు బ్లాగర్ల సమావేశం – హైదరాబాద్

 1. నివేదిక హృద్యంగా ఉంది. చదువరి కిషోర్ కాదు, శిరీష్. చివరి లిస్టులో అందరి పేర్లూ బిరుదులతో సహా రాయడం బాగుంది కానీ పద్మనాభం గార్నీ, వెంకటరమణనీ వొదిలెయ్యడం బాలేదు. నోటికి ఆనందాన్ని పంచాయి – భలే భలే

 2. పాఠకులు మన్నించాలి… ముఖ్యంగా వెంకటరమణగారు మరియు పద్మనాభంగారు….

  వారి బ్లాగులవివరాలు తెలుసుకోవడానికి శథవిదాలా ప్రయత్నించాను, గూగుళమ్మను కూడా ఎంతో వేదించాను…. కానీ ఏ వివరాలు తెలుసుకోలేకపోయాను….

  (వ్యాసం చివర్లో “క్షమించాలి” అనే వాఖ్యం రాయడంలో నా ముఖ్యఉద్ధేశ్యం కూడా ఈ విషయమే)

  ఇప్పటికైనా సమయం మించిపోలేదు… వెంకటరమణ, పద్మనాభంగార్ల బ్లాగువివరాలు తెలియజేస్తే… మలిప్రచురణలో ఇలాంటి తప్పిదాలు రాకుండా తగుజాగ్రత్త వహిస్తాను…

  ఇట్లు మీ ప్రియయువ బ్లాగరి
  నంద

  @రామక్రిష్ణగారు… చెన్నపట్నం గురించిన వివరాలు నాకు అంతగా ఏమీ తెలియవండి… వీవెన్‍గారేమైనా (కూడలి విషయంగా) సహాయం చెయ్యగలరేమో కనుక్కోండి..
  @కొత్తపాళీగారు… కిషోర్‍గారిపైన *ను గమనించి, పేరును తెలిపినందుకు కృతజ్ఞతలు…
  @రానారెగారు… థాంక్యూ – సారీ !!!
  @రాదికగారు… థాంక్యూ
  @నెటిజన్‍గారు… మీకుకూడా మంచి థాంక్యూ…

 3. నంద, రానారె, కొత్తపాళీ గారు,
  నాకు బిరుదులేమి లేకుండా వెంకట రమణ అని ఉండటమే బాగుంది. నా బ్లాగు కూడా “వెంకట రమణ బ్లాగు” కాబట్టి బిరుదివ్వడానికి ఆస్కారం కూడా లేదులెండి. :).

 4. సమావేశ వివరాలను చాలా చక్కగా కనులకు కట్టినట్లుగా అందించుటకు చేసిన మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం అందులో నూరు శాతం విజయం సాధించారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 5. అల్లసాని వారిని బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయమంటే, రమణీప్రియ దూతికలేకపోయినా పర్వాలేదు కానీ, ‘నందగిరి’ లాంటి వ్రాయసకాడు లేకుండా కుదరదంటాడు. అందరూ మాటలాడుతోంటే నిశ్శబ్దంగా తనపని కానిచ్చేసాడు ప్రవీణ్.

 6. బాగుందండి మీ నివేదిక. ఇలా ఇంటికెళ్ళి అలా రాసేసినట్టున్నారే!
  జాన్ హైడ్ గారు “కవి” కదా. బిరుదు మీరే చూడండి.
  అన్నిటికంటే పద్మనాభం గారి బిరుదు బాగుంది. (నన్ను చదువరి బాబాయ్ అనలేదు, సంతోషం! 🙂 )
  అన్నట్టు, ‘ప్రణభాంకుర’ అంటే ఏమిటి?

 7. అభినందన మందారాలు తెచ్చిన అందరికీ… ఈ ‘నంద’ వంద వందనాలు……

  @సుగాత్రి : లింకులు అందించినందుకు ధన్యవాదాలండి.

  @చదువరి : ఒక ‘కవి’కి లాజికల్‌గా బిరుదిచ్చేంత పాండిత్యం నావద్ద లేదండి.
  ప్రవీణ్ + భాగ్యనగరం + కుమార్ = ప్రణభాంకుర. అభినందించినందుకు థాంక్యూ బాబాయి ( 🙂 సరదాకి).

 8. చాలా కాలం తరువాత చదవబుల్ సమావేశపు వివరాలు ఇచ్చారు. సమావేశమంటే అజెండా నే కాదు చదవండయా అని చెప్పించేట్టు వుంది.

  — విహారి

  నా గొడవ: ఈ వ్యాఖ్యానాలు చూసిన తరువాత నా మరో టపా వెలుగు చూడకుండా కాలగర్భం లో కలిసిపోయింది. 😦

 9. థాంక్యూ జ్యోతక్క… మీ గొడవకి పరోక్షంగా కారకుడినైనందుకు చింతిస్తున్నాను విహారిగారు.. కానీ “ఈ వారం సిధ్ద — బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్) ” ఒక మంచి టపా.. చాలా బాగుంది…

  ఈ-తెలుగు లో ప్రచురించబడిన విజయ్ గారి వ్యాసం చూడండి … ఇక్కడ http://etelugu.org/node/91

 10. అయ్యో జ్యోతక్క…. మీరు రాసిన వ్యాఖ్య క్రిందే, విహారిగారు ఒక వ్యాఖ్య రాసారు కదా…. మీ ఇద్దరి వ్యాఖ్యలకి రిప్లై ఒకే వ్యాఖ్యలో, ఒకే లైనులో ఇవ్వడం వల్ల ఈ గందరగోళం తలెత్తింది…. అంతే !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s