ప్లీజ్…దయచేసి సహయం చేయండి ! – విఘ్నేష్

నా పేరు విఘ్నేష్. వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మా నాన్నగారు ఈశ్వర్. జనన-మరణాల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అమ్మ పార్వతి. హౌస్‌వైఫ్. మా ఊరు కైలాస్‌బర్గ్. మీ హైదరాబాద్ నుండి దాదాపుగా ఒక మూడున్నర లక్షల కి|మీ| దూరంగా ఉండొచ్చు. పేరుకు మేము ఉండేది అక్కడే అయినా, ఇక్కడున్న ఆస్తులను, బంధువులను చూసిపోవడానికి సంవత్సరంలో రెండుమూడుసార్లైనా వస్తూ ఉంటాం.

               అలాగే మా కంపెనీ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే సైబర్ టవర్స్‌లో ఉంది. ఆన్ సైట్ పనిపైన ప్రతి సంవత్సరం ఓ పదిరోజుల పాటు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాను. మేనేజర్ స్థాయిలో ఉన్నపుడు ప్రజెంటేషన్స్ వినడం, క్రొత్త ప్రాజెక్ట్‌లను స్టడీ చేయడంలాంటి పనులు ఎలాగూ ఉంటాయి కదా !

                 ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చే పనే కాబట్టి, వీలుగా ఉంటుందని మొన్నే సులభ వాయిదాల పద్దతిలో ఒక బండి తీసుకున్నాను. కొనేటప్పుడు ఏ బండి తీసుకోవాలా అని బాగానే ఆలోచించాను కానీ.. నా పర్సనాలటీకి పల్సర్‌లు, సీబీజీలు సరిపడవని, ఒక బుల్లి వెహికిల్ తీసుకున్నాను.

                   బ్రాండ్ నేమ్ కూడా కొత్తదే ఏదో ‘మూషిక్’ అంట ! మైలేజ్ కూడా బాగానే ఇస్తుందని విన్నాను. పోనీలే ఓసారి ప్రయత్నిద్దామని కొన్నాను. కొన్నాళ్లు బాగానే పనిచేసింది. అదేంటో ఈ మధ్య తెగ సతాయిస్తంది. సర్వీసింగ్ చేయించాను… ఊ…హు… రిపేర్ చేయించాను….. అయినా లాభం లేకపోయింది. ఇక నాకు చిర్రెత్తుకొచ్చి, ఒక్క తన్ను తన్నాను. నా బలం ఏంటో అప్పటికి నాక్కూడా తెలియదు. తన్నాక తెలిసింది, నేను తన్ని తన్నుడికి అది కాస్త అక్కడి నుండి ఇక్కడి దాకా ఎగిరి వచ్చి ఎక్కడో పంజాగుట్టలో పడిందని.

                    కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఏం చేయను, ఇంకొక బండీ కొనలేను …(ఈ మంత్ బడ్జెట్ ఆల్‌రెడీ ఖతం అయిపోయింది 😦 ) అలాగని వర్క్‌పైన ఇక్కడికి రాకుండా కూడా ఉండలేను… అదీగాక రేపే నా రిపోర్టింగ్ డేట్ కూడ … (అసలే మా బాస్ ‘యమ’ స్ట్రిక్టు )… కానీ ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు. ఈ కన్‌ఫ్యూజన్‌లో నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్న విషయం కూడ మరచిపోయి ఇదిగో ఇలా ఏడ్చేసాను పొద్దున్నే…..

 Vignesh

          సో….దయచేసి మీలో ఎవరికైనా నా బండి కనబడితే ప్లీజ్ నాకు అప్పగించండి.

            అయ్యయ్యో ! టెన్షన్‌లో మీకు అసలు విషయం చెప్పడం మరిచే పోయాను… మీ అందరికీ వినాయకచవితి శుభాకంక్షలు…

ఇట్లు

మీ ఫ్రెండ్ ‘విఘ్నేష్’.

సాఫ్ట్‌వేర్ ప్లానింగ్ ఇంజనీర్
కైలాస్ టెక్నాలజిస్
కైలాస్‌బర్గ్

ప్రకటనలు

6 thoughts on “ప్లీజ్…దయచేసి సహయం చేయండి ! – విఘ్నేష్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s