నా మలి కవిత !

       

                  కాలేజి కారిడార్‌లో యథాలాపంగా అందరం దోస్తులం కలిసి కబుర్లు చెప్పుకుంటుండగా అటెండర్ ‘భాయ్’ వచ్చి, ఉపకారవేతనాలు (స్కాలర్‌షిప్) వచ్చాయని చెప్పాడు. ఆమాట అందరికీ తీపి కబురే అయింది. ఎందుకంటే ఉ.వే లు వచ్చినవాళ్లం సంబరపడతాం, రానివాళ్లం వచ్చిన వాళ్లిచ్చే ట్రీట్‌తో ఖుషి అవుతాం…… చెక్కులను అక్భర్ ‘భాయ్’ దగ్గర తీసుకొని అలా… అలా…. జీషాన్ కేఫ్ వైపు అడుగులువేశాం…

                  ఆర్డర్ ఇచ్చాక మాటల్లో పడ్డాం – ముస్లిం మైనారిటీ కాలేజిలో మా ప్రయాణం గురించి….. కానీ నా మనసు మాత్రం, నా కళ్లముందున్న మా దోస్తుగాడి గురించే అలోచిస్తోంది…. దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన వాడికి ప్రతి సంవత్సరం రూ. 20,000 లు తేవడమంటే వాళ్లనాన్న మరోప్రామిసరీనోటుపైన సంతకం చేయడమే ….అప్పుడు నా మనసు పలికింది ఇలా! …

.

ఎస్సీగా పుట్టినోళ్లంతా నిరుపేదగారు..


           ఓసీలా బ్రతికెటోళ్లంతా శ్రీమంతుగారు….!

.
వెనుకబడ్డోళ్లకొచ్చె యేటికేడు చెక్కులు..


            రెడ్డి, మా దోస్తుకొచ్చె చేతినిండ అప్పులు….!!

ఇది కేవలం నా స్వభిప్రాయం మత్రమే…. ఎవరిని నొ(ఒ)ప్పించడానికి కాదు….!

ప్రకటనలు

3 thoughts on “నా మలి కవిత !

  1. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంచేస్తాను రాధికగారు … ఒకటి, ఇది కేవలం నా స్వంత అభిప్రాయం. రెండు, దీనిపైన నేను చర్చ చేయాలనుకోవడం లేదు. చివరగా నేను బ్లాగ్సంగానికి కొత్త, కావున ఇంతక్రితం జరిగిన చర్చల గురించి నాకు ఇసుమంతైనా తెలియదు…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s