భాగ్యనగర్ బ్రహ్మచారికి బహు భాదలు….

       బ్లాగు మొదలెట్టాక ఇన్నాళ్ళకు ఒక సగటు భాగ్యనగర్ బ్రహ్మచారిగా మా అద్దె ఇంటి యజమానిని మనసారా స్మరించుకునే సంధర్బం దొరికింది నాకు.

            ముందుగా వారి గురించి చిన్న పరిచయ వ్యాక్యం …..

             మొదటి నుండి వారి(యజమాని, యజమానురాలు) ది ఒకలాంటి మనస్తత్వం. అది ఎలాంటిదంటే, ఉద్యోగం నుండి వచ్చాక మూసుకున్న తలుపులు మల్లి మరుసటినాటి ఉదయం ఉద్యోగానికి బయల్దేరేటప్పుడు మాత్రమే తీసుకునేంత. అందునా వారు ఉండేది ఎలాగూ భూమ్యంతస్తు ( గ్రౌండ్ ఫ్లోర్) కావడం వల్ల, ప్రతి నెల ౧(1)వ తారీఖున మినహా వాళ్లను చూసే భాగ్యం మాకు ఏ విధంగాను కలగకుండేడిది……

             కానీ అంతటి కష్టసాధ్యమైన వారి ముఖారవింద ప్రదర్శన కూడా మాకు ఉచితంగా కలిగే మరియొక సంధర్బం, మా నీటి సంపు జగడం….

               భూమ్యంతస్తులో ఒక సంపు కట్టించారు మా యజమాని గారు. రోజు విడిచి రోజు అందులో మున్సిపాలిటీ వారు విడుదల చేసే నీరి చేరుతుంది. ఇక మొదటి అంతస్తులో ఉన్న మాకు, మా ప్రక్క వాటా (వీళ్లది ఇంకా విచిత్రమైన కాపురం, వీలు చూసుకొని చెప్తాను.) వారికి వాడుక నీరు వచ్చేది, ఈ సంపులో నిండినదే.

           అవును !! అయితే ఏంటి ? అనుకుంటున్నారా ?… అక్కడికే వస్తున్నా… 

.

“ఆ సంపుకి బిగించారు ఒక పంపు –

 దాని పేరెత్తితే మాకు ఒళ్లు జలదరింపు” 

ఆ పంపంటే వాళ్లకెందుకో అంత ఇంపు –

అర్థం కాక మా బుర్రలౌతాయి కంపు కంపు…

.

.

   నెలలో మొదటి రెండు రోజులు అద్దె చెల్లించకపోయినా భరిస్తారేమోగానీ, పంపు పది నిమిషాలు ఆలస్యంగా కట్టేసామంటే మాత్రం చీల్చిచెండాడుతారు (ఎందుకంటే, దాన్ని ౧౦ (10) నిమిషాలకు మించి అదే పనిగా నడిపించకూడదు కాబట్టి)….

      ఇక నా పరిస్థితి…. పరీక్షకు ఒక్కరోజు ముందు పుస్తకం దుమ్ముదులిపినా కూడా ఇంజనీరింగ్ లో ౭౦ (70) శాతం మార్కులు పొందిన ఘనజ్ఞాపకశక్తి నాది. అదేంటో మరి, కిందికెళ్లి పంపు ప్రారంభించి వస్తాను, మళ్లీ యజమానురాలు పైకి వచ్చి, “ఎవరమ్మా, బోర్ వేసి బంజేయకుండా (కట్టేయకుండా) వచ్చింది?” అని అరిచే వరకు గుర్తుండిచావదు.

             కట్క (మీట) వేసి మరిచిపోవడం నా(మా)కు, పైకి వచ్చి తిట్టిపోవడం వాళ్లకు దాదాపుగా అలవాటైంది.

          ఏదో అలా కాలం గడిచిపోతుండగా, ఉన్నట్టుండి ఈ రోజు మా అన్నయ్య స్నానాల గదినుండి గట్టిగా కేక వేసి పిలిచి, ” ఒరేయ్ ప్రవీణు, వాటర్ అత్తలేవు, కిందికి పోయ్ బోరేసిరాపో !” అని చెప్పాడు. సరేలే ఇది మనకు మామూలే కదా అని వెళ్లి చూస్తే షాక్…. … ఫ్యుజ్ లేకపోవడం – యజమానిగారి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి,  నాకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి….

      అక్కడచూస్తే అన్నయ్య స్నానాలగదిలొ చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు… ఇక్కడ చూస్తే, ఫ్యూజ్ లేదు… ఏం చేయాలా అని తీవ్రంగా అలోచిస్తూ పైకి వచ్చాను…. అప్పుడే మస్తిష్కంలో తలుక్కున మెరిసిందో అలోచన…. “ఓనర్ వాళ్లు ఫ్యూజ్ పీక్కెలితే ఏంటి, మా వాటా ఫ్యూజ్ ఉందిగా !” అనుకొని. .. వెంటనే పైకి ఎక్కి ఫ్యూజ్ పీకేసాను… మా వాటాలో పవర్ కట్.! అయితేనేమి, అత్యవసర పరిస్థితుల్లో నీటిని మించిందేదీలేదని, కిందికి వెళ్లి,, ఫ్యూజ్ పెట్టి మీట నొక్కాను….. మొదట సరిగా కుదరలేదు… ప్రయత్నిస్తే రెండవసారి కుదిరింది ఎలాగైతేనేమి సరిగ్గా ఒక బకెట్ నిండే వరకు ఉంచి… యజమాని వస్తున్నారని గమనించి వెంటనే మీటను నిర్వీర్యం చేసి… ఫ్యూజ్ తో సహా పైకి పరుగెత్తుకొచ్చాను…..

                                            హమ్మయ్య….!!! ఎలాగైతేనేమి,

              అన్నయ్యకు కార్యశాంతి…. నాకు మనశ్శాంతి……

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s