నా తొలి కవిత

                   smiling flower              

                           అది నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివే రోజులు (౪ (4) సంవత్సరాల క్రితం)…ఒకరోజు నా స్నేహితురాలు ‘చిన్ని’  పుట్టినరోజునాడు, బస్‌లో కాలేజికి వెళ్తుండగా, తీవ్రంగా ఆలోచించాను – తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాలా అని….

                     అప్పుడే వచ్చింది ఒక ఆలోచన, ‘కవిత’ ని బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుందని…. ! బాగానే ఉంటుంది….. కానీ కవిత ఎలా రాయడం ?..  అప్పటి వరకు అలాంటివి రాసి (కనీసం చదివి) కూడా ఎరుగను.!… సరే, ఎలాగైతే అలాగయ్యిందని, అలోచించడం మొదలు పెట్టాను….

                           మామూలుగానే ఒక చక్కని పువ్వు మదిలో మెదిలింది. కానీ పువ్వుని పొగుడుతూ ( లేదా వర్ణిస్తూ) కవిత రాస్తే, అది తనకెలా చెందుతుందని, మరల అలోచిస్తుండగా, పువ్వులకు సంబంధించిన ఒక వాస్తవం గుర్తుకువచ్చింది… అదే వాటి ఆయుర్థాయం …! అవి ఎంత అందంగా పుట్టినా, ఆ ఆనందం మనకెంతోకాలం మిగలకుండానే అవి వాడిపోతాయి… కానీ మనిషి జీవితం అలా కాదుకదా ! కావాల్సినన్ని (దాదాపు ౨౫౫౫౦ (25550) ) రోజులు హాయిగా బ్రతికేస్తాం… 

                    సో ! పువ్వుకి, మనిషికి లంకె దొరికింది కదా అన్న ఆనందంలోంచి పుట్టిందే ఈ నా తొట్టతొలి కవిత…!!!

 .

“జీవితకాలం ఒకరోజైనా –

                     పూవు పరిమళిస్తుంది, క్షణక్షణం…

శతవసంతాలు నీ సొంతం !

                     ఆనందం పంచు అనుక్షణం !!

 మా’చిన్ని’ పాపకు ఓ చిన్ని కానుక !!!”

 .

 .                           – ఇట్లు నీ స్నేహితుడు

                             నందగిరి ప్రవీణ్ కుమార్

ప్రకటనలు

2 thoughts on “నా తొలి కవిత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s