యోగశాస్త్ర బ్రహ్మ : పతంజలి

patanjali

యోగాభ్యాసాల గురించి శాస్త్రవంతంగా విశ్లేషించిన యోగి “పతంజలి”. క్రీస్తుకు 200ల వత్సరాల మునుపే యోగసూత్రాల గురించి పతంజలి సమగ్రమైన చర్చ చేసాడనేది చరిత్ర.

పతంజలి సిధ్దాంతం ప్రకారం మన శరీరంలో కీలకమైన “చక్రస్థానాలు” అనెడి కేంద్ర స్థానాలు ఉంటాయి. ఈ స్థానాలను ప్రేరేపించినపుడు మన శరీరంలో అంతర్గతంగా వున్న శక్తి వెలువడుతుందని సిధ్దాంతీకరించాడు. నాడీ కేంద్రస్థానాల ఉత్ప్రేరణకు యోగాభ్యాసాలను మించిన సాధనాలు లేవని ఇతడు బలీయంగా విశ్వసించాడు.

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాస, సమాధి అని పిలువబడే ఎనిమిది రకాల యోగాభ్యాసాల ద్వారా మనిషి అతీత స్థాయిని అందుకోవచ్చని పతంజలి భావన.

ఒక నీటి మడుగు అలలతో కల్లోలితమై వున్నప్పుడు దాని అడుగులో ఉన్న బంగారు నాణెం ఎలా కనిపించదో అలాగే మనసు నిర్మలంగా లేనప్పుడు అంతర్లీనంగా వున్న భగవంతుని తత్త్వం మనిషికి అందదని ఆ నిర్మలత్వం కోసం యోగాభ్యాసం అవసరమని పతంజలి వ్యాఖ్యానించాడు.

భారతీయ యోగాభ్యాసాల పట్ల ఇప్పుడిప్పుడే విశ్వవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఆశించిన ఫలితాలు లభ్యమవుతున్నాయి కూడా ! (యోగాపై ప్రపంచపు కాపీరైట్ పోటీని చదవండి ఇక్కడ క్లిక్ చేసి)…

ప్రకటనలు

2 thoughts on “యోగశాస్త్ర బ్రహ్మ : పతంజలి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s