దాతృత్వం

blind

అంధులు : మాకు కావలసింది శిక్షణజాలి కాదు….

అంధులుగా పుట్టడం మా పాపం కాదు, శాపం అంతకంటే కాదు… అది మాలో ఒక లోపం మాత్రమే !

ఆ వైకల్యాన్ని ఎదిరించే మనోదైర్యం కూడా ఆ దేవుడు మాకు ప్రసాదించాడు… ఇక కావాల్సిందల్లా సాటి మనుషులైన మీ ఆదరణ…

ఒక చల్లని చూపు, ఒక వెచ్చని పలకరించు మా వెంట ఉంటే చాలు – మేమూ ఈ జగతిలో భాగమని నిరూపించుకోగలం…

నాగమణి: పూర్తి అంధురా లిగా ఈ లోకంలోకి వచ్చిన నాకు నలుపే నా ప్రపంచమైంది. అమ్మ నాన్నల ప్రేమ మరియు స్నేహితుల పలకరింపే నాకు ఆలంబనయి బ్రతకడానికి తగిన ఊరటనిచ్చాయి. పాడటమంటే నాకిష్టం, ఎందుకంటే నేను మీలా సినిమాలు చూడలేను టి.వి ని ఆనందించనూలేను. అందరమ్మాయిలలాగా పట్టు పరికిణీలూ, వెండి పట్టీలు వేసుకోలేను (చూసి ఆనందించలేను కూడా)… కాని ఇవేవి లేని లోటు నాకు నా గొంతు తీర్చింది.

ఈ పాపలాగే ఎంతోమంది ఒక్కచోట కలిసి బ్రతుకుబండినీడుస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక ప్రతిభ… మామూలు వారికి ఏ మాత్రం తీసిపోని ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నారు భవిష్యత్తువైపు….

సాటి మనుషులుగా మీరూ కాస్త సమయాన్ని వారికి కేటాయించగలం అనుకుంటే…. బేగంపేట మెయిన్ రోడ్ లో ఉన్న దేవనార్-అంధుల పాఠశాలకు వెళ్ళిరండి.మీ ఆత్మీయ పలకరింపే వారికి వేల రూపాయలతో నమానం. మీరు వారికి వడ్డించే ఒక్కొ మెతుకును కూడా మీ పేరున వారు తలచుకుంటారు.

ఒకవేళ మీరు ధనసహాయం కూడా చేయగలిగే సిరిపుత్రులౌతే మీ సహాయం వారి భవితకి ఒక మార్గాన్ని చూపగలదు.

చిరునామా:  దేవనార్ అంధుల పాఠశాల, గీతాంజలి ఉన్నత పాఠశాల ప్రక్కన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురు సంధి, బేగంపేట్ రోడ్, సికిందరాబాద్.

పూర్తి వివరాలకు సంప్రదించండి : http://www.devnarfoundationfortheblind.org/ పైన

ప్రకటనలు

2 thoughts on “దాతృత్వం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s