jump to navigation

నా డైరీ మరో పేజీ జులై 29, 09

Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.
trackback

నాడు:

కవ్వింపుల కనుచూపుల్లో పుట్టిన నా కలల విత్తనం..

తన చిరునవ్వుల చిరుజల్లుల్లో తడిసి మొలకెత్తి..

మా ఆశల ఊపిరి పీల్చుతూ  పెరిగింది… మొక్కయింది.

నేడు:

ఆశేలేని వేడి ఆవిరిలో అవిసి..

జీవమేలేని నవ్వులో సజీవంగా మసిబారి..

నా కన్నీటి సంద్రంలో జలసమాధి అయింది… మరిణించింది.

అయినా….

తనకి బహుమతిగా ఇచ్చిన నా ఆశల గాజు శిల్పాన్ని విసిరికొట్టి విదిలించుకొనివెళ్లినా….

నిందించను తనని…!

ఎందుకంటే,

ఆ కరకు మాటల మాటున తన మనసేంటో తెలియదు నాకు…

తెలపనేలేదు.. తన నాకు….

వ్యాఖ్యలు»

1. Nutakki Raghavendra Rao - నవంబరు 27, 09

ఏకపక్ష వ్యామోహ ఫలితాలిలానే వుంటాయని భూతంలో ఎన్నెన్నోవుదాహరణలున్నాయి మరి.