jump to navigation

ఉదారత్వానికిది సమయము సెప్టెంబరు 1, 08

Posted by నంద in వెబ్ సహాయం.
trackback

తెలుగు బాషాభిమానులకి నమస్కారములు. ఒక మంచి పని నిమిత్తము మీకు ఈ ఉత్తరం పంపడం జరిగింది.

నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో పనిచేస్తున్నానని మీకు తెలిపేఉంటాను. మా సహోద్యోగి అయిన నిర్మల్ గారు, ఈ నెల రెండవవారంలో వాళ్ల స్వగ్రామం వెళ్లినప్పుడు, వాళ్ల ఇంటికి సమీపంలో నివసించే ‘వీనస్’ అనే 15 ఏళ్ల కుర్రాడు విపరీతమైన జ్వరంతో బాధపడడం చూసి చలించి, కాకినాడ ఏరియా ఆసుపత్రిలో చూపించగా, హైదరాబాద్ నిమ్స్ కి సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ పరీక్షలన్ని ముగిసాక తెలిసిన విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి రక్తంలోని ఎర్రరక్తకణాలు క్రమక్రమంగా విభజన చేందుతూ, రక్తంలో వాటి పరిమాణం గణనీయంగా తగ్గుతోందని.

సంతోషించదగ్గ విషయం ఏమిటంటే అది చాలా మొదటి దశలో ఉంది. సాదారణంగా దీనిని ‘బ్లడ్ క్యాన్సర్’ గా వ్యవహరిస్తారు… శాస్త్రీయంగా ‘ఆక్యూట్ ల్యుకేమియా’ గా వ్యవహరిస్తారు.
నిమ్స్ వైద్యులు డా|| నరేంద్ర గారు పూర్తి వైద్యపరీక్షలు జరిపి వ్యాధి పూర్తి చికిత్సకి దాదాపు 4 లక్షలు ఖర్చు కాగలదని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ మరియు దినసరి కూలీలు అయిన వాళ్ల తల్లిదండ్రులకి ఇది తలకి మించిన భారమే. తెలుపు కార్డుదారులయిన వీరికి, ‘ఆరోగ్య శ్రీ’ పథకం కింద రూ|| 2 లక్షల వరకు నమకూరాయి. కానీ మిగిలిన ధనానికి వాళ్లు స్థానిక ఎమ్మెల్యేతో సహా ఎంతోమందిని ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మా స్నేహితులు నిర్మల్ గారు, ఈ విషయాన్ని మా కార్యాలయపు మానవ వనరుల అధికారికి లిఖిత పూర్వకంగా తెలిపారు… వారు సహృదయంతో స్పందించి తత్‌క్షణంలో రూ.50,000/- లకు గాను చెక్‌ని మంజూరు చేశారు. మిగిలిన మొత్తానికై ఆఫీసునందలి ఉద్యోగులందరికి ఒక ఈ-మెయిల్ పంపి విజ్ఞప్తిచేశారు… స్పందించిన ఎంతోమంది, వారి వారి టీమ్‌ సభ్యుల విరాళాలు దాదాపు రూ.65,000/- లతో వచ్చారు. ఒకానొక ఉద్యోగి చొరవతో సినీనటుడు నందమూరి బాలక్రిష్ణ అభిమానులు వారికి తోచినంతలో రూ.25,000/- లను వారి అభిమాన నటుడి చేతులమీదుగా వీనస్ తల్లిగారికి అందచేశారు.
మిగిలిన మొత్తానికై నిర్మల్ మరియు మాయొక్క మిత్రబృందం శతథా ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలోనే మన తెలుగు బ్లాగు సభ్యులని అభ్యర్థిద్దామని తలంచి ఈ ఉత్తరం రాయడం జరిగింది.

దయచేసి, మీ పరిధిలో ఈ విషయాన్ని గురించి ఆలోచించి, మన తెలుగు బ్లాగర్లకి తెల్పి బాబుకి ఏమైనా సహాయపడగలమేమో ఆలోచించండి.

బాబు యొక్క nims_report, సాక్షి పత్రికలో అతడిపై వచ్చిన కథనాన్ని, ఆ బాబు యొక్క ఫోటోని జతచేయడం జరిగింది. గమనించగలరు.

ఇట్లు మీ

‘భాగ్యనగరం’ ప్రవీణ్ కుమార్

బాలుని పూర్తి వివరాలకు మరియు మీయొక్క అమూల్యమైన సహాయానికి సంప్రదించండి:

ప్రవీణ్ కుమార్ (ఈమెయిల్): pravynandas@gmail.com

(మొబైల్): +91 9985043032

వ్యాఖ్యలు»

1. నంద - సెప్టెంబరు 4, 08

ధన్యవాదములు తుమ్మల శిరీష్ కుమార్ గారు..

02/09/2008 BIL/0000XXXXXX22/Towards Cancer patie/NS CR INR 1,000.00 అందినవి

2. నంద - సెప్టెంబరు 5, 08

సాక్షి పత్రికలో వీనస్ పై ఇవాల్టి (05 సెప్టెంబర్) కథనం ఇక్కడ