jump to navigation

వెజిటెబుల్ కిచిడి ఆగష్టు 5, 07

Posted by నంద in వంటకాలు.
trackback

కావాల్సినవి : 1) క్యారెట్ / టొమాటొ / బీన్స్ / ఆలు  ముక్కలు : కొన్ని

                     2) బియ్యం  : 150గ్రా. 

                     3) పెసర పప్పు / కంది పప్పు : 1 కప్పు 

                    4) గరం మసాల : 1/2 టీస్పూన్

                    5) బఠాణి  : 50గ్రా. 

                    9) పచ్చిమిర్చి : 5

                    6) నూనె, ఉప్పు, జీలకర్ర, పసుపు : తగినంత

                   

 తయారు చేయు విధానం : బియ్యం మరియు పప్పులను బాగా కడిగి నానపెట్టుకోవాలి.  కూరగాయలను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.  స్టవ్ వెలిగించి, బాణలిలో తగినంత నూనె పోసి వేడి చేయాలి.  నూనె కాగాక జీలకర్ర వేసి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. తగినంత పసుపు వేయాలి. అందులోనే పచ్చిబఠాణిలను కూడా వేయించాలి.  అన్ని బాగా వేగింతర్వాత 1 పాలు బియ్యానికి 2 పాల్లు నీటిని అందులో పోయాలి.

               ఈ మిశ్రమం బాగా మరుగుతుండగా తగినంత ఉప్పు, కొంచెం గరం మసాల వేసుకోవాలి.  కావలిస్తె దాల్చినచెక్క మరియు బగారా ఆకు వేసుకోవచ్చు.  ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యం-పప్పుల మిశ్రమాన్ని ఇందులో వేసి, బాగా కలియబెట్టి మూతపెట్టుకోవాలి. 

                 పదినిమిషాలు ఉడికించింతర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని… స్టవ్ మంటను పూర్తి సిమ్ లో పెట్టుకోవాలి.   3 నిమిషాల తర్వాత స్టవ్ ని ఆర్పివేయాలి.

                ఘుమఘుమలాడే “వెజిటెబుల్ కిచిడి” రెడీ !

వ్యాఖ్యలు»

No comments yet — be the first.