Post

దాతృత్వం

blind

అంధులు : మాకు కావలసింది శిక్షణజాలి కాదు….

అంధులుగా పుట్టడం మా పాపం కాదు, శాపం అంతకంటే కాదు… అది మాలో ఒక లోపం మాత్రమే !

ఆ వైకల్యాన్ని ఎదిరించే మనోదైర్యం కూడా ఆ దేవుడు మాకు ప్రసాదించాడు… ఇక కావాల్సిందల్లా సాటి మనుషులైన మీ ఆదరణ…

ఒక చల్లని చూపు, ఒక వెచ్చని పలకరించు మా వెంట ఉంటే చాలు - మేమూ ఈ జగతిలో భాగమని నిరూపించుకోగలం…

నాగమణి: పూర్తి అంధురా లిగా ఈ లోకంలోకి వచ్చిన నాకు నలుపే నా ప్రపంచమైంది. అమ్మ నాన్నల ప్రేమ మరియు స్నేహితుల పలకరింపే నాకు ఆలంబనయి బ్రతకడానికి తగిన ఊరటనిచ్చాయి. పాడటమంటే నాకిష్టం, ఎందుకంటే నేను మీలా సినిమాలు చూడలేను టి.వి ని ఆనందించనూలేను. అందరమ్మాయిలలాగా పట్టు పరికిణీలూ, వెండి పట్టీలు వేసుకోలేను (చూసి ఆనందించలేను కూడా)… కాని ఇవేవి లేని లోటు నాకు నా గొంతు తీర్చింది.

ఈ పాపలాగే ఎంతోమంది ఒక్కచోట కలిసి బ్రతుకుబండినీడుస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక ప్రతిభ… మామూలు వారికి ఏ మాత్రం తీసిపోని ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నారు భవిష్యత్తువైపు….

సాటి మనుషులుగా మీరూ కాస్త సమయాన్ని వారికి కేటాయించగలం అనుకుంటే…. బేగంపేట మెయిన్ రోడ్ లో ఉన్న దేవనార్-అంధుల పాఠశాలకు వెళ్ళిరండి.మీ ఆత్మీయ పలకరింపే వారికి వేల రూపాయలతో నమానం. మీరు వారికి వడ్డించే ఒక్కొ మెతుకును కూడా మీ పేరున వారు తలచుకుంటారు.

ఒకవేళ మీరు ధనసహాయం కూడా చేయగలిగే సిరిపుత్రులౌతే మీ సహాయం వారి భవితకి ఒక మార్గాన్ని చూపగలదు. 

చిరునామా:  దేవనార్ అంధుల పాఠశాల, గీతాంజలి ఉన్నత పాఠశాల ప్రక్కన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురు సంధి, బేగంపేట్ రోడ్, సికిందరాబాద్.

పూర్తి వివరాలకు నన్ను సంప్రదించండి : pravynandas@gmail.com మెయుల్ పైన

కాపాడుకునేదెలా ?

                    ఓ భార్యా భర్తల జంట. ముగ్గురుపిల్లలు. చిన్నపాటి జీవనోపాధి. ఎవరినీ చేయి సాచకుండా ఉన్నంతలో హాయిగానే సాగిపోతున్న జీవితం. కాని… ఊహించని విధంగా ముంచుకొచ్చిన ముప్పు ఇప్పుడు ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తోంది……….. ఇద్దరు పిల్లల రెండు మూత్రపిండాలు చెడిపోయాయన్న నిమ్స్ వైద్యులు, ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే మూత్రపిండాలతోపాటు మూడు, నాలుగు లక్షల రూపాయలు అవసరమవుతాయనడంతో దిక్కుతోచక రోదిస్తున్నారు కన్న తల్లిదండ్రులు. వరంగల్ జిల్లాకు చెందిన లింగ సుదర్శన్ దంపతుల కూతురు ధనలక్ష్మి(23) , కొడుకు ఆంజనేయులు(21) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యచికిత్స కోసం ఇల్లు అమ్ముకుని, ఉన్న ఊరు విడిచి వచ్చి, ప్రస్తుతం హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని వాజ్ పేయ్ నగర్ లో ఉంటున్నారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా వచ్చే నెల సంపాదన కుటుంబపోషణకే సరిపోని స్థితిలో, కన్న బిడ్డలను ఎలా కాపాడుకునేదని తల్లడిల్లిపోతున్నారా తల్లిదండ్రులు. డయాలసిస్ కే నెలకు 20 వేలకు పైగా ఖర్చవుతోందని, ఈ స్థితిలో మానవతా దృక్పథంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

చిరునామా:

ఎల్.సుదర్శన్, ప్లాట్ నంబర్ 49, వాజ్ పేయ్ నగర్, నేరేడ్ మెట్, మెల్కాజ్ గిరి – 500 056, హైదరాబాద్, ఆం.ప్ర. ఇండియా,  ఫోన్- +91 99857 91145                                                

  

                                                            ‘ఈనాడు’ సౌజన్యంతో…

2 స్పందనలు to “దాతృత్వం”

  1. please save them , atleast pray for them.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.